Home » Yuvagalam Padayatra
కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
కృష్ణాజిల్లా: టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నూజివీడు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో ప్రసంగాలకు సంబంధించి తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడి విడిగా కేసులు నమోదు చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఏకాంత భేటీ అయ్యారు. గురువారం యువగళం పాదయాత్ర విరామ సమయంలొ లోకేష్‌తో సమావేశం అయ్యారు.
రంగన్నగూడెం ఘర్షణపై తెలుగుదేశం నేతలు వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గన్నవరం బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీసారంటూ టీడీపీ నేతలు లోకేశ్, కొనకళ్ల నారాయణకు నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు వస్తున్న జనాదరణను వైసీపీకి మింగుడుపడటం లేదు. దీంతో తప్పుడు ప్రచారానికి పూనుకుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శలు చేసినట్లు వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఎంపీ గల్లా జయదేవ్ స్పందించి ఈ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండించారు.
సీఎం జగన్ ఓ పిరికి వ్యక్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు.