Home » YSRCP Cadre
ప్రజలు ఛీకొట్టినా జగన్ తీరు మాత్రం మారడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్ లాంటి నేర మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులకు ఏమాత్రం ఇష్టం ఉండదన్నారు.
మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాజ్యసభలో ఏపీ మెగా డీఎస్సీ అంశాన్ని ప్రస్తావించి రభస చేయడానికి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. గురువారం రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరగగా వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో పరామర్శలు ఉంటాయని అంతా భావించారు. యాక్సిడెంట్ ఘటనలో కుమారుడిని కాపాడటానికి కుట్ర చేసిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శిస్తారని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్‌ది ఆది నుంచీ అడ్డుపుల్ల వేసే ధోరణే! అసలు కొత్త ఎయిర్‌పోర్టు అవసరమా? ‘విశాఖలో ఒకటి ఉందికదా! ఎర్రబస్సు రాని ఊర్లో ఎయిర్‌పోర్టు కడతారా?’... అంటూ ఎద్దేవా చేశారు. కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం! అని బహిరంగ సభల్లో ప్రకటించారు.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన పోలీసులనే భయపెట్టేలా సాగింది. జగన్ వెంట వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
వైసీపీ అధినేత జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లా జైలుకు వెళ్లనున్నారు. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు.
మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే.. నవ్యాంధ్రలో స్వర్ణయుగం సాకారం అవుతుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి అడ్డగోలుగా మాట్లాడారు. ‘‘పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి. 80 ఏళ్లు వస్తున్నాయి’’ అని ‘ఎక్స్’ లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వైసీపీ నేత తమ్మినేని సీతారాం భూ భాగోతాలు ఇంకా చాలా ఉన్నాయని.. అవన్నీ కూడా విచారణ జరపమని ఆదేశాలిచ్చామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.