Home » YS Viveka
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల నుంచి మౌనంగాఉండి ఈరోజు వివేకా నంద రెడ్డి హత్య గురించి మాట్లా డుతున్నారని.. ఆయనకు ప్రతి ఒక్కటి బాగా తెలుసని ఈ హత్య కేసు నిందితుడు, జై భీమ్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి తెలిపారు. సిద్ధం సభలు పెట్టుకొని జగన్మో హన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవ రు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.
రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఏపీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్‌లో నామినేషన్ వేయనున్నారు.
‘హత్య విషయంపై మేం అక్కాచెల్లెళ్లం మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే కోర్టుకు వెళ్లారు. అయినా వీరు వేసిన పిటిషన్‌లో కోరింది ఒకటి.. కోర్టు ఇచ్చిన ఆర్డర్ మరొకటి. దీనిపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తండ్రి వైఎస్ వివేకా హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు.
2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్... 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా నాటి ఘటనలనే ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఏఫ్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడలోని సింగ్ నగర్‌లో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై ఆగంతకులు రెండు రాళ్లు వేశారు.
కడప జిల్లా అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప జిల్లా. అలాంటి జిల్లాలో రాజకీయం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. కడప ఎంపీగా బరిలో దిగారు. దీంతో ప్రచారంలో ఆమె బాణంలా దూసుకు పోతున్నారు.
మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేనత్తకు వయసు మీద పడిందని.. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతూ ఉండొచ్చని స్పష్టం చేశారు.
కడపలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) విమర్శించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.