Home » YS Vijayamma
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ కన్నతల్లి వైయస్ విజయమ్మ ముందే ఊహంచారా? అంటే ఆమె ముందే ఊహించి ఉండ వచ్చునని ఉమ్మడి కడప జిల్లా వాసులు తాజాగా అభిప్రాయ పడుతున్నారు.
వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్.. అక్రమాస్తుల కేసులో అరెస్టయి నేటికి అంటే... మే 27వ తేదీకి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2012 మే 27వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో దిల్ కుషా గెస్ట్ హౌస్‌లో వైయస్ జగన్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది
ఏరు దాటే దాక ఓడమల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న.. ఇది మనం తరచుగా వినే సామెత.. చేసిన సహాయాన్ని మరిచిపోయి కృతజ్ఞత చూపని వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు.. ఇది... ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్‌కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుందంటున్నారు ఏపీ ప్రజలు.. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి అరెస్టై నేటికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఒక్కసారి గతమంతా ఏపీ ప్రజల కళ్లముందు కదులుతోంది.. ఆ సమయంలో జగన్ కుటుంబం ఆడిన డ్రామా.. ఆస్కార్ నటులను మించి పలికించిన హావభావాలు.. సొంత కుటుంబ సభ్యులను తన రాజకీయ స్వార్థం కోసం వాడుకొని వదిలేసిన విధానం.. తాను జైల్లో ఉన్నన్ని రోజులు తన వారిని, అయిన వారిని రోడ్ల మీద ఉంచి.. ప్రజల్లో పొందిన సానుభూతి.. వాటి ద్వారా అధికారంలోకి వచ్చిన విధానం.. ఇవన్నీ తలచుకొని ఏపీ ప్రజలు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాల కోసం ఆ యా పార్టీ నేతలే కాదు... ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్.. మదర్స్ డే సందర్భంగా ఆయన తన తల్లి వైయస్ విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేయక పోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్‌కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ప్రతిపక్ష నేతగా ప్రజల మధ్య పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అధిష్టించారు. ఆ తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యకు వచ్చిందీ లేదు.
పులివెందుల అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
వైయస్ విజయమ్మకు ఆమె కుమార్తె, ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాకు జన్మనిచ్చి.. ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ... నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనః శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్‌డే మా అంటూ ఎక్స్ వేదికగా వైయస్ షర్మిల కన్నతల్లికి బర్త్‌డే విషెష్ చెప్పారు.
సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పై జరిగిన రాయి దాడి వెనుక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు. రాయి దాడి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జలదేనని ఆరోపించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల ఫ్రీ ప్లాన్‌తో జగన్‌పై సింపతి కోసమే రాయి దాడి చేయించుకున్నారని విమర్శించారు.