Home » YS Sunitha Reddy
Andhrapradesh: ‘‘షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు’’ అని ఆరోపణలు చేస్తూ వచ్చిన పోస్ట్‌లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తల్లిని, చెల్లిని జగన్ దూరం పెట్టారని.. సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే జగన్‌కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
Telangana: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం న్యాయం కోసం కుమార్తె వైఎస్ సునీత చేస్తున్న పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ సునీత తిరుగుతున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో బెదిరింపులు వచ్చినప్పటికీ సునీత వెనక్కి తగ్గలేదు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరిలో విచారించనుంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు వైఎస్ సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణలో ఆమె ఇంప్లీడ్ అయ్యారు.
సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కేసు విచారణ నేడు జరిగింది. లాయర్ సిద్ధార్ధ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సుప్రీంను వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి కోరారు.
ఇవాళ మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయ్ జయంతి. అయితే జగన్ సహా ఎవరూ కూడా ఆయన జయంతిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు.
జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తన సోదరి డా. వైఎస్ సునీతారెడ్డే (Dr YS Sunitha Reddy) దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు...
పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. నేడు అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకాహత్య కేసులో తనను, తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, వైఎస్ వివేకా కూతురు సునీత, అలాగే బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు రెండేళ్లుగా కుట్ర పన్నారన్నారు.
ప్రైవేట్ డిటెక్టివ్‌కైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కల్పిత కథలే కనిపిస్తున్నాయి. బేసిక్ లాజిక్‌ను సీబీఐ మిస్ చేసింది. జగన్‌ను డీమోరలైజ్ చేయడానికే వివేకాను చంపారు. కీలక విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదు.
హైదరాబాద్: వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించారు. వివేకా హత్య కేసు ఛార్జిషీటుతో పాటు సునీత వాంగ్మూలాలను కూడా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.