Home » YS Sharmila
రాష్ట్రంలో, దేశంలో మైనారిటీల హక్కులు కాపాడేది తమ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉద్ఘాటించారు. ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ పార్టీని విశ్వశిస్తున్నారని.. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని షర్మిల సూచించారు.
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి న్యాయ నిపుణుడికి ఇండియా కూటమి అవకాశం ఇవ్వడం హర్షణీయమని షర్మిల వ్యాఖ్యానించారు.
మహానేత YSR పేరు పెట్టినంత మాత్రాన ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా అని షర్మిలా ప్రశ్నించారు. YSR ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడని కీర్తించారు.
Jagan: NCLTలో జగన్‌కు ఊరట లభించింది. తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని జగన్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. NCLT తీర్పును విజయలక్ష్మి, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిబంధనలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. చిన్న పథకానికి ఇన్ని కొర్రీలు ఎందుకు? అంటూ ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్, కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేర్వేరుగా నివాళి అర్పించారు.
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీవోఏ) అనుమతులు లేకుండానే వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇచ్చారు? కోర్సు కాలం పూర్తయితే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఏంటి?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
ఇండోసోల్ కోసం ఊరినే ఖాళీ చేయిస్తారా..! ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. ఊరిని చంపి పరిశ్రమను పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హెచ్చరించారు.
YS Sharmila: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.
స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్‌మోహన్‌రెడ్డి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.