Home » YS Sharmila
వైసీపీకి, రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన విజయసాయిరెడ్డి... రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిలతో భేటీ అయినట్లు తెలిసింది.
YS Sharmila: కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. మోడీ గారి భారత్ బడ్జెట్(బీహార్ ఎన్నికల)లో ఏపీకి కేటాయింపులు .. ‘కొండంత రాగం తీసి కూసంత పాట’ పాడినట్లుందని వ్యంగ్యంగా పేర్కొ్న్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలున్న సీఎం నితీష్ కుమార్.. బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే.. 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు గారికి మాత్రం మోదీ చిప్ప చేతిలో పెట్టారని మండిపడ్డారు.
Vijaya Sai Reddy meeting with YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. లోటస్ పాండ్‌లోని ఆమె నివాసంలో ఈ సమావేశం జరిగింది.
YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మోదీ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు మద్దతు ఉపసహరించుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఉంటే.. ఎంత అభివృద్ధి అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధించడం కష్టమని చెప్పారు. హోదాతోనే అభివృద్ధి, సంపద సృష్టి సాధ్యమవుతుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
YS Sharmila: నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల విమర్శించారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట.. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు ఉందని అన్నారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని..80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ ఆంధ్ర రత్న భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేస్తున్నారని, పార్లమెంట్ వేదికగా అంబేద్కర్‌ను అవమానించారని ఆమె విమర్శించారు.
వివేకా హత్య విషయంలో నిజాలు చెప్పిన సాయిరెడ్డి, మిగిలిన విషయాలు కూడా బయటపెట్టాలని పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు.
YS Sharmila: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చురకలు అంటించారు. జగన్‌ను వీసా రెడ్డి వంటి వారే వదిలేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు.
YS Sharmila: ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువని.. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడయ్యారని వైఎస్ షర్మిల విమర్శించారు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందన్నారు.
‘దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.