Home » YS Jagan Mohan Reddy
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి అడ్డగోలుగా మాట్లాడారు. ‘‘పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి. 80 ఏళ్లు వస్తున్నాయి’’ అని ‘ఎక్స్’ లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్.. చంద్రబాబు కోట్టేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు.
మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్‌కు లేదని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని విరుచుకుపడ్డారు.
వైసీపీ నేతలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాల్‌ను వైసీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే స్వీకరించాలన్నారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని జగన్, వైసీపీకి ఛాలెంజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘జగనన్న కాలనీల’ ఇళ్ల స్థలాల భూసేకరణలో భారీ స్కాం జరిగింది. రూ.1,140.24 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీవీఎల్ నరసింహారాజు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఈరోజే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
వైసీపీ నేత తమ్మినేని సీతారాం భూ భాగోతాలు ఇంకా చాలా ఉన్నాయని.. అవన్నీ కూడా విచారణ జరపమని ఆదేశాలిచ్చామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
వైసీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం భూ అక్రమాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.