Home » YCP
శాంతియుత నిరసన చేపట్టిన మహిళలపై వైసీపీ కార్యకర్తలు అరాచక వాదులుగా విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. మహిళలనే కనీస జ్ఞానం లేకుండా చెప్పులు విసిరారు. బూతులు, దుర్భాషలతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో పలువురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చారు. అక్కడ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్‌కు నిరసన సెగ తగిలింది.
Kakani: కృష్ణపట్నం లారీ అసోసియేషన్‌ని నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి.. పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాణి సహాకారం అందించారని విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోర్టు నుంచి 60 ఎక్స్‌పోర్ట్ కంపెనీలు తరలిపోయాయి. ఇరవై వేల మంది ఉపాధికి గండి పడింది.
తిరుపతిలో వైసీపీ హయాంలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదానీ స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు పేరుతో మోసంపై అదానీ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘ప్రభుత్వంపై విషం చిమ్మండి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలి. దీనికోసం సోషల్ మీడియాను వాడుకోండి’’.. తిరుపతి అంతర్గత సమావేశంలో వైసీపీ తీర్మానం ఇది. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది.
YCP Leader Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు.
ఓసారి జగన్ ఐదేళ్ల పాలనను గుర్తుచేసుకుంటే.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనం.. మద్యం, ఇసుకలో అడ్డగోలు దోపిడీ.. ప్రకృతి వనరులకు చెర.. విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా.. అంతులేని అవినీతి, కమీషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. ఇలా ఎన్నో అరాచకాలు.
అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంది. రోత చానల్ లైవ్ డిబేట్‌లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకం-రవాణా కేసులో ఏ-4గా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డికి మూడ్రోజుల పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది.
రాజధాని అమరావతిపై కుల ముద్రలు వేసి, మహిళలను అవమానిస్తారా..? ఇక్కడ వెలసిల్లిన బౌద్దాన్నీ అవహేళన చేస్తారా..?’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు.