• Home » Warangal

Warangal

గడ్డల యూరియా ఏం చేసుకోవాలి?

గడ్డల యూరియా ఏం చేసుకోవాలి?

యాసంగి నాట్లతో ఊపందుకున్న వ్యవసాయ పనుల్లో రైతులు తీరికలేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు కూలీల కొరత మరోవైపు సంక్రాంతి పండుగ సమీపిస్తుంటే త్వరితగతిన వ్యవసాయ పనులను ముగించుకోవాలనే ఆతృత అన్నదాతలను పరుగులు పెట్టిస్తోంది.

కుల, చేతి వృత్తులకు పీఎం విశ్వకర్మ

కుల, చేతి వృత్తులకు పీఎం విశ్వకర్మ

వృత్తి నైపుణ్యం కలిగిన నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ‘‘విశ్వకర్మ యోజన’’ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఎటువంటి షూరిటీలు లేకుండా నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లోకి జమచేసే ప్రక్రియ కొనసాగిస్తుంది. ఈ విధానం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తుంది. లబ్ధిదారుని వృత్తిని ఆధారంగా చేసుకుని దరఖాస్తు చేసుకున్న వారికి ఆయా వృత్తులో శిక్షణ ఇచ్చి మరీ రుణం అందజేస్తుంది.

సర్వాంగ సుందరంగా మేడారం ముస్తాబు

సర్వాంగ సుందరంగా మేడారం ముస్తాబు

Medaram: ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతర కోసం మేడారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 40 లక్షల మందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం.. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 12న ఆలయ శుద్ది, పూజలు, గ్రామ నిర్బంధంతో సహా ఆచారాలు నిర్వహించనున్నారు.

ధరలు దడ..దడ

ధరలు దడ..దడ

నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. మూడు నెలల కాలంలో సరుకుల ధరలు 20 నుంచి 30 శాతానికి పెరిగాయి. సంచి నిండా డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునేలా పరిస్థితులు మారాయి. ఏ వస్తువు ధర చూసినా సామాన్యుడి గుండె ఆగినంత పనవుతుంది. పప్పులు నిప్పుల్లా వేగుతున్నాయి.

పరిహారం కోసం పోరు

పరిహారం కోసం పోరు

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని ఎల్కేశ్వరం రైతుల పోరు ఉధృతమైంది. చిన్నకాళేశ్వ రం ప్రాజెక్టు పరిధిలోని మందరం చెరువు నుంచి ఎన్కపల్లి వరకు నిర్మించనున్న మెయిన్‌ కెనాల్‌ పనులను ఎల్కేశ్వరం రైతులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. తమ భూములను సేకరించిన అధికారులు పరిహారం ఇచ్చాకే పనులను ప్రారంభించాలని రైతులు భీష్మించుకు న్నారు.

చేనేతకు తీపి కబురు

చేనేతకు తీపి కబురు

రాష్ట్రంలోని నేత కార్మికులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురును అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు ఆర్థికభరోసా కల్పించేందుకు సిద్ధమైంది. చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది.

 బతుకుదెరువుకు ఇదే ఆ‘దారం’

బతుకుదెరువుకు ఇదే ఆ‘దారం’

దసలి పట్టు.. వారికి జీవనోధారం. తరతరాలుగా ఉపాధికి ఎంచుకున్న ఏకైక మార్గం. ప్రకృతితో మమేకమైన బతుకుదెరువు అది. లాభనష్టాలను బేరీజు వేసుకో కుండానే ఈ పరిశ్రమనే నమ్ముకొని కాలం వెళ్లదీస్తు న్నారు వారు. మహదేవపూర్‌ అటవీ ప్రాంతంలో దసలి పురుగులు పెంచడం, టస్సర్‌ కాలనీలో పట్టు వస్త్రాలను నేయడమే వారి పని.

ఆయిల్‌పాం కోసం అడుగులు

ఆయిల్‌పాం కోసం అడుగులు

రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును పెంచేందుకు ప్రభుత్వం మరో అడుగువేస్తోంది. ఆయిల్‌పాం రైతులకు రవాణా ఖర్చులు, శ్రమను ఆదా చేయాలని తెలంగాణ ఆయి ల్‌ఫెడ్‌ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతులకు అందుబాటులో ఉండేలా నియోజకవర్గా నికి ఒకటి చొప్పున ఆయిల్‌పాం గెలల సేకరణ (కొనుగోలు) కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావి స్తోంది.

చిన్నారులను ఆకట్టుకునేలా..!

చిన్నారులను ఆకట్టుకునేలా..!

చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలు ఆకట్టుకు నేలా ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నారుల మొదటి మెట్టు అంగన్‌వాడీ నుంచి ప్రారంభమయ్యే విద్యను బలోపేతం చేస్తూ.. మెరుగైన పౌష్టికాహారాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల పేరును మార్పు చేసి అన్ని కేంద్రాలకు పూర్వ ప్రాథమిక పాఠశాల నామకరణంతో కొత్త విద్యను అందుబాటులోకి తీసు కొస్తుంది.

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి