• Home » Vizag News

Vizag News

AP News: విశాఖలో భారీగా ఈ సిగరెట్ల పట్టివేత

AP News: విశాఖలో భారీగా ఈ సిగరెట్ల పట్టివేత

విశాఖ నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఈ సిగరెట్లను భారీగా పట్టుకున్నారు. నగరంలోని మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో అమ్మడానికి సిద్ధంగా ఉన్న 743 ఈ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అమ్ముతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల విలువైన ఈ సిగరేట్లను పట్టుకుని సీజ్ చేశారు.

Dadi Veerabhadrarao: వారు విశాఖను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారు

Dadi Veerabhadrarao: వారు విశాఖను డ్రగ్స్ అడ్డాగా మారుస్తున్నారు

విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ లభించిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు(Dadi Veerabhadrarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్థాల వ్యాపారి సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్స్ యజమానులను ఉరితీయాలని హెచ్చరించారు. మానవత్వం లేని ఈ మృగాలను, వారికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను శిక్షించాలని అన్నారు.

Pranav Gopal: సీఎం జగన్ ఏపీను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారు

Pranav Gopal: సీఎం జగన్ ఏపీను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారు

సీఎం జగన్ అన్నపూర్ణాంధ్రప్రదేశ్‌ను డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓటర్లను మత్తు పదార్థాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవడానికి జగన్, అతని అనుచరులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

AP Politics: ఆ కంపెనీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు

AP Politics: ఆ కంపెనీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు

తనపై సోషల్ మీడియాలో వైసీపీ (YSRCP) నేతలు విషప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) అన్నారు. శనివారం నాడు సచివాలయంలోని సీఈఓ ఆఫీసుకు వచ్చారు. తనపై సోషల్ మీడియాలో చేస్తున్న విషప్రచారంపై అడిషనల్ సీఈఓను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపారు. ట్విట్టర్, సోషల్ మీడియా వేదికలుగా తనపై వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Chandrababu: ఏపీని డ్రగ్స్‌కు రాజధానిగా మార్చిన వైసీపీ ప్రభుత్వం

Chandrababu: ఏపీని డ్రగ్స్‌కు రాజధానిగా మార్చిన వైసీపీ ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వం(YSRCP Govt) ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ పోర్టులో సీబీఐ 25000 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు.

Drugs: రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

Drugs: రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

విశాఖపట్టణం షిప్పింగ్ యార్డ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 25 వేల కిలోల డ్రగ్స్‌ను కస్టమ్స్, సీబీఐ అధికారులు కలిసి సీజ్ చేశారు. బెయ్యి బ్యాగులను సీజ్ చేశారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఆపరేషన్ గరుడ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఈ డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

TDP: కీలక నేతలతో గంటా శ్రీనివాస్ మీటింగ్.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

TDP: కీలక నేతలతో గంటా శ్రీనివాస్ మీటింగ్.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Ganta Srinivasa Rao Meeting: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఎక్కడ్నుంచి పోటీచేస్తారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. మొదటి జాబితాలో పేరు లేకపోవడం.. ఇవాళ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్‌లోనూ లేకపోవడంతో అసలు గంటా ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? పోటీ చేస్తారా.. లేదా..? హైకమాండ్ ఏం చెబుతోంది.. ఈయనేం ఆశిస్తున్నారు..? టీడీపీ (TDP) పెద్దలు గంటాకు ఏం చెప్పారు..?

AP NEWS: విశాఖ రామానాయుడు స్టూడియోపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

AP NEWS: విశాఖ రామానాయుడు స్టూడియోపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

విశాఖ రామానాయుడు స్టూడియో (Ramanaidu Studio) పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్టూడియో భూముల అమ్మకాలపై సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. విచారణలో భాగంగా స్టూడియో భూముల అమ్మకాలపై పలు అంశాలను కోర్టు దృష్టికి పిటీషనర్లు తీసుకువచ్చారు.

Jagan Govt: ఎన్నికల ముందు వలంటీర్లతో మరో కుట్రకు తెరలేపిన జగన్ ప్రభుత్వం

Jagan Govt: ఎన్నికల ముందు వలంటీర్లతో మరో కుట్రకు తెరలేపిన జగన్ ప్రభుత్వం

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన సీఎం జగన్‌రెడ్డి (CM Jagan) పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. వలంటీర్ల(Volunteers)తో ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు తెరలేపారు.

Breaking: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..

Breaking: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..

Train Accident In Andhra: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయాయి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి