Home » Visakhapatnam
Visakha Tragic Road Accident: విశాఖకు చెందిన పూర్ణిమ అనే మహిళ తన స్కూటీపై వెళుతోంది. ఏఎంజీ ఆస్పత్రి సమీపానికి చేరుకుంది మహిళ. కానీ ఆ మార్గంలో ఆమెకు ప్రమాదం పొంచి ఉందని తెలీక ఎప్పటి లాగే స్కూటీపై వెళ్తోంది. ఇంతలోనే అక్కడే ఉన్న ఓ భారీ చెట్టు ఆమెపై పడిపోయింది.
Jagan BC Controversy: వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ జగన్ క్లాస్ డైలాగ్స్ కొడతారు. కానీ పదవులు ఇచ్చే విషయంలో ఈ వర్గాలు ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.
సింహాచలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్రాయింగ్ లేకుండా, సిమెంట్ పిల్లర్లే లేకుండా నిర్మించిన గోడ కూలిపోయి ఏడుగురు భక్తుల ప్రాణాలు కోల్పోయారు. ప్లాన్ లేకుండా, ఆమోదాలు లేకుండా, హడావిడిగా నిర్మాణం చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది.
Simhachalam Incident: సింహాచలం గోడ కూలిన ఘటనపై విచారించేందుకు త్రిసభ్య కమిటీ సభ్యులు సింహగిరికి చేరుకుంది. కమిటీ సభ్యులకు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సుబ్బారావు స్వాగతం పలికారు. విచారణ కమిటీ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
సింహాచలంలో అర్ధరాత్రి 2.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసి రక్షణ గోడ కూలిపోయింది. వర్షంతో పాటు పిడుగులు, ఉరుములు, గాలులు తీవ్ర నష్టానికి దారి తీసాయి.
సింహాచలంలో ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చందనోత్సవానికి ముందు నిర్మాణం చేసిన గోడ కుప్పకూలింది. పునాది లేకుండా నిర్మించిన గోడ వర్షం కారణంగా కూలిపోయింది.
విశాఖ స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్‌ఫర్నేస్-1లో గ్యాస్ లీక్ కావడంతో నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని సీఐటీయూ ఆరోపించింది.
అమరావతి: శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు.
విశాఖపట్నం: సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. రూ. 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలి వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నారు.
సింహాచలంలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి భక్తులు మృతి చెందడం బాధాకరమని, మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.