Home » Visakhapatnam
అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతాల్లో అల్పపీడనాల ప్రభావంతో ఈ నెల 28లోగా నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు నమోదయ్యాయి.
Covid positive case: 2020-2021లో కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు విశాఖపట్నంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు తగు సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.
విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.
వడగాడ్పులకు ఊరటగా కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మే 21 తరువాత అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి నైరుతి రుతుపవనాలు ముమ్మరంగా విస్తరించనున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. తొలగించిన కార్మికులను తిరిగి తీసుకోవాలని, స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖలో జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ పర్యటనకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయాన్ని చూసుకుంటుంది.
విజయనగరం కోరకుండ సైనిక్ స్కూల్ మాజీ విద్యార్థులు, నేవీ విశ్రాంత అధికారులైన శ్రీనివాస్ కల్నల్, సీడీఎన్‌వీ ప్రసాద్ సముద్ర యాత్ర ప్రారంభించారు. వారు న్యూజిలాండ్ నుంచి అండమాన్ దీవుల వరకు 34 అడుగుల బోటులో ప్రయాణిస్తున్నారు.
నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సీఎస్ విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
MLA Vs MRO: తహశీల్దార్‌పై ఎమ్మెల్యే బూతుపురాణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత రాత్రి పదిగంటల సమయంలో తనకు ఫోన్ చేసి బూతులతో విరుచుకుపడ్డారంటూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
CM Chandrababu: అంతర్జాతీయ యోగాడేపై సీఎం చంద్రబాబు శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నంలో జరిగే యోగాడేలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారని చెప్పారు.