Share News

Yoga Event: విశాఖ బీచ్‌రోడ్డుపై పచ్చ తివాచీ

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:17 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌ రోడ్డుపై ఐదు లక్షల మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించి గిన్నీస్‌ రికార్డు సాధించడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Yoga Event: విశాఖ బీచ్‌రోడ్డుపై పచ్చ తివాచీ

  • 5 లక్షల మంది కూర్చునేలా రోడ్డు పొడవునా ఏర్పాటు

  • వాహనాల రాకపోకలు నిలిపివేత.. యోగాంధ్రకు విస్తృత ఏర్పాట్లు

విశాఖపట్నం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌ రోడ్డుపై ఐదు లక్షల మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించి గిన్నీస్‌ రికార్డు సాధించడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21న విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకూ తీరం పొడవునా లక్షలాది మంది యోగాసనాలు వేయనున్నారు. ఇందుకోసం బీచ్‌ రోడ్డు మొత్తం గ్రీన్‌ మ్యాట్‌ వేస్తున్నారు. అలాగే ఆసనాలు వేసే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన మ్యాట్‌, టీ షర్ట్‌, ఓఆర్‌ఎస్‌ బాటిల్‌ను కిట్‌గా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఈ భారీ కార్యక్రమం కోసం గత కొద్దిరోజులుగా ఎక్కడికక్కడ యోగాపై శిక్షణ ఇస్తున్నారు. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు అపార్ట్‌మెంట్లు, కల్యాణ మండపాలు, పార్కుల్లో యోగా శిక్షణ నిర్వహిస్తున్నారు. సముద్రంలో యుద్ధనౌకలపై కూడా యోగాసనాలు వేయడానికి తూర్పు నౌకాదళం ఏర్పాట్లు చేసింది. బీచ్‌ రోడ్డుపై ఏర్పాట్లు జరుగుతున్నందున మంగళవారం నుంచే ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

Updated Date - Jun 18 , 2025 | 05:19 AM