• Home » Visaka

Visaka

Minister Lokesh: క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: మంత్రి లోకేశ్..

Minister Lokesh: క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: మంత్రి లోకేశ్..

మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇద్దరి వాహనాల డ్రైవర్లకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..

Visakha: రెచ్చిపోయిన కామాంధుడు.. భీమిలిలో మరో దారుణ ఘటన..

భీమిలి పట్టణానికి చెందిన ఓ బాలుడు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించినప్పటికీ రోజూ వెంటపడేవారు. అయితే ఇదే క్రమంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించి అత్యాచారం చేశాడు.

Steel Plant: ఆ విషయంలో కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి: ఎమ్మెల్సీ బొత్స..

Steel Plant: ఆ విషయంలో కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి: ఎమ్మెల్సీ బొత్స..

కూటమి పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమా లేక వ్యతిరేకమా? చెప్పాలంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారని, ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి దాన్ని సంపాదించుకున్నట్లు బొత్స చెప్పుకొచ్చారు.

AP Minister: మంత్రిగా తొలిసారి విశాఖకు నారా లోకేశ్

AP Minister: మంత్రిగా తొలిసారి విశాఖకు నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నేడు ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తొలిసారిగా మంత్రి నారా లోకేశ్.. జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

Python: విశాఖ గంగవరం పోర్టులోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన కార్మికులు..

Python: విశాఖ గంగవరం పోర్టులోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన కార్మికులు..

గంగవరం పోర్టు(Gangavaram Port)లోకి భారీ కొండచిలువ(Python) ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

YCP MLC: వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్సీ వీడియో నిజమేనా..?

YCP MLC: వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్సీ వీడియో నిజమేనా..?

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహార శైలి తలనొప్పిగా మారింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రచ్చ రచ్చ చేసింది. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ల వ్యవహారం ట్రెండింగ్ అయింది. ఇది కాస్త మరుగున పడిందని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో ఎమ్మెల్సీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

ఋషికొండపై భవనాలు ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆ ఋషికొండ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉక్కు సీఎండీ... అభినవ నీరో..!

ఉక్కు సీఎండీ... అభినవ నీరో..!

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సీఎండీ అతుల్‌ భట్‌ అభినవ నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారు. రోమ్‌ నగరం తగలబడిపోతుంటే... నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించినట్టు... ఇక్కడ ఈయన కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు.

Minister Anagani: వైసీపీ పాలనలో భూ అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని

Minister Anagani: వైసీపీ పాలనలో భూ అక్రమాలపై చర్యలు: మంత్రి అనగాని

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలు జరిగినట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satyaprasad) ఆరోపించారు. విశాఖలో మాత్రమే భూ అక్రమాలు జరిగాయని అనుకుంటే పొరపాటే అన్నారు. ఆగస్టు 15సందర్భంగా విశాఖ గ్రీన్ పార్క్ కూడలి వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Home Minister Anita: అనాగరికంగా హత్య చేశారు..

Home Minister Anita: అనాగరికంగా హత్య చేశారు..

విశాఖపట్నం: హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం బెల్లం వినాయకున్ని, సంపత్ వినాయకున్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిని మీడియా పలుకరించగా.. కర్నూలు టీడీపీ నేత శ్రీను హత్యపై స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యకు గురయ్యారని, అనాగరికంగా హత్య చేశారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి