Home » Vijayawada
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలించారు.
విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
విద్యార్థుల పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ దారుణంగా ప్రవర్తించారు. పాఠశాలకు బూట్లకు బదులు చెప్పులు వేసుకొచ్చారని విద్యార్థులకు చెప్పుల దండతో పనిష్మెంట్ ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఓ మహిళా భక్తురాలి నుంచి రూ.50 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించారు. మహా కుంభాభిషేకం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
విజయవాడ దుర్గమ్మ గుడిలో జరిగే మహాకుంభాభిషేకానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆలయ అధికారులు ఆహ్వానం అందించారు. ఈనెల 6 నుంచి 8 వరకు దుర్గ గుడిలో కుంభాభిషేక మహోత్సవం జరగనుంది.
టీడీపీ అధిష్థానం జోక్యం చేసుకున్నా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో వారిద్దరి మధ్య ప్రొటోకాల్ చిచ్చు ఏర్పడింది.
మిర్చి ఆగమనాలు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి తగ్గాయి. దాదాపుగా 30 శాతం తక్కువగా పంట దిగుబడిని రైతులు విక్రయించడానికి తీసుకొస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయిప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో జి.సాయిప్రసాద్‌ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా మీరా అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించారు అధికారులు. ప్రత్యేక భద్రత నడుమ అంబులెన్స్‌లో ఆయేషా మీరా అవశేషాలను తెనాలికి తరలించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, పరారీలో ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డి విజయవాడ సిట్ ఆఫీస్‌లో లొంగిపోయారు. వివరాల్లోకి వెళితే..