Home » Videos
Pastor Praveen: ప్రవీణ్ పగడాల కేసును ప్రభుత్వం ఎంత సావధానంగా పరిష్కరించిందో ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వివరించారు. ఈ కేసులో భాగంగా వాళ్లు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలంటే.. చాలా గంటల పాటు శ్రమించి.. ఆ ఫుటేజ్ ఇచ్చామన్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీసీ ఫుటేజ్ కెమెరా అందజేశామని ఆమె పేర్కొన్నారు. పోస్ట్ మార్టం చేయడానికి దాదాపు 38 గంటలు పట్టిందన్నారు. ఓ బాడీకి 10 గంటలలోపు పోర్ట్ మార్టం నిర్వహిస్తే.. స్పష్టమైన నివేదిక ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కానీ 38 గంటల తర్వాత బాడీ పోస్ట్‌మార్టం జరిగిందని చెప్పారు. దీనిపై నివేదిక ఇవ్వడానికి ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 4285 కోట్లు విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం నిధులను విడుదల చేసింది.అందులో కేంద్రం వాట రూ. 750 కోట్లు. అమరావతిలో పనులు ప్రారంభమవుతోన్నందున 25 శాతం నిధులను అడ్వాన్సుడుగా ఇవ్వాలని సీఆర్‌డీఏ కోరింది. ఈ నేపథ్యంలో ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)కు కొందరు ఖాతాదారులు తాళం వేసి, బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. బ్యాంక్‌లో గత సంవత్సరం నవంబర్ 19న దుండగులు చోరీకి పాల్పడి 497 మందికి చెందిన సుమారు 16 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లారు. తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకుంటున్నా.. బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు.
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములు దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ క్రమంలో 15.17 ఎకరాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని విశాఖపట్నం కలెక్టర్‌ను ఆదేశించింది. విశాఖ వేదికగా సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాటి టీడీపీ ప్రభుత్వం 2003లో బీమిలి బీచ్ రోడ్డులోని 34. 44 ఎకరాల భూమిని ఎస్‌పీ ప్రోడక్షన్‌కు కేటాయించింది.
తెలంగాణ రాజకీయాలు కంచ గచ్చిబౌలి చుట్టు నడుస్తున్నాయి. గతంలో భూముల విక్రయంపై బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంది. ప్రస్తుతం గచ్చిబౌలి భూ వివాదంపై అదే పార్టీకి చెందిన కేటీఆర్ ఏమన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల వేలంపై హెచ్ సీ యూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన పీక్ స్టేజ్‌కు చేరింది. ఓ వైపు విద్యార్థుల నిరసనలు ఉాదృతంగా కొనసాగుతూంటే.. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఆందోళనతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
డాలర్ డ్రీమ్స్ పూర్తిగా చెదిరిపోతున్నాయా? ట్రంప్ పాలనలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అసలు కారణం చెప్పకుండా..స్టుడెంట్ వీసా రాగానే ఎందుకు తిరస్కరిస్తున్నారు.ట్రంప్ వచ్చాక.. అమెరికా కండ కావరం పెరిగిందా? అమెరికాలో చదువుకోవాలనేది చాలా మంది విద్యార్థులకు ఒక కల.
సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీల జాబితాలో వంగవీటి రాధా పేరు లేదు. దీంతో ఆయన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వంగవీటి రాధా కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. 2019లో.. అది ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో రాధా విబేధించారు. దీంతో ఆయన టీడీపీలో చేరారు.
ఇటీవల రాజమండ్రిలో మరణించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అంశంలో నిజాలు వెలుగులోకి రావాలని పాస్టర్లు ఆకాంక్షించారు ప్రవీణ్ మరణించిన నాటి నుంచి తామంతా బాధపడుతున్నామన్నారు. మంచి సేవకుడిని, మంచి మిత్రుడిని తాము కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రజల స్పందించిన తీరు అంతా చూశారన్నారు. క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలను అభివర్ణించారు. మేము శాంతిని,సమాధానాన్ని కోరుకుంటామన్నారు. అనవసరంగా తమను రెచ్చగొడితే.. నష్టపోయేది మేము కాదని మీరేనని రాజమండ్రిలోని పాస్టర్లు తెలిపారు.
ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందిస్తోంది. ఈ కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తోంది. సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో కార్యక్రమాన్ని వీక్షించండి
ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారా? అమెరికాలో వలే.. మన దేశంలో సైతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతారా? కొత్త వలసల బిల్లు ఏం చెబుతోంది. భారత్ ఏమి ధర్మశాల కాదు.