Home » Vemireddy Prashanthi Reddy
‘జయ జయోస్తు’ అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన సతీమణి కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి, టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించడంతో అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరులో తెరలేచినట్లైంది
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు నెల్లూరు సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమన్నారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా సైతం వేమిరెడ్డి ఉన్నారు. ఆయన సతీమణి వచ్చేసి టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు.
AP Elections 2024 : అనిల్ కుమార్ యాదవ్.. (Anil Kumar Yadav) నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.. అయితే ఈ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాతో క్లియర్ కట్‌గా తేలిపోయింది. వైసీపీ (YSRCP) హైకమాండ్ అనిల్‌ను ఎందుకు ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తోందో..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే సంగతి దేవుడెరుగు..? అవన్నీ ఇక్కడ అనవసరం. అనిల్ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు..? సీఎం జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మనసులో ఎవరున్నారు..? అనేది ఇప్పుడు నెల్లూరు సిటీలో (Nellore City) జరుగుతున్న చర్చ..