Home » Tungabhadra
తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది 80 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయరాదని నిర్ణయం తీసుకున్నారు. క్రస్ట్ గేట్ల దురవస్థ కారణంగా ముందు జాగ్రత్త చర్యలతో నీటిని దిగువకు వదిలే యోచనలో ఉన్నారు.
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు సాగునీరందించే తుంగభద్ర రిజర్వాయర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల నేపధ్యంతో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తున్నారు.
తుంగభద్ర డ్యాం గేట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి, వాటి సామర్థ్యం 40-55% తగ్గిపోయింది. 2026 జూన్ నాటికి మొత్తం 33 గేట్లను మార్పిడి చేయడానికి ₹60 కోట్లతో టెండర్లు పిలవబడినట్లు టీబీపీ బోర్డు ప్రకటించింది.
తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) మరమ్మతుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంది. ఈక్రమంలోనే గత ప్రభుత్వ ఆంక్షలను ఎత్తేస్తూ రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రతి ఏటా కాలువలో కేటాయింపు జలాలను సరిహద్దు నుంచి పీఏబీఆర్ ...
సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో పది రోజులకుపైగా శ్రమించి ‘స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్’ ఏర్పాటు చేశారు.
గంగావతి తాలూకా సణాపుర గ్రామం వద్ద తుంగభద్ర నది(Tungabhadra River)లో ఈతకని వెళ్ళి నదిలో కొట్టుకుని పోయిన హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యురాలు అనన్యరావు(26) మృత దేహాన్ని ఎట్టకేలకు గురువారం రక్షణ సిబ్బంది గుర్తించారు.
సరదా కోసం చేసిన సాహసం.. ఓ యువ వైద్యురాలి ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువతి 20 అడుగుల ఎత్తైన రాయి మీద నుంచి తుంగభద్ర నదిలో దూకి గల్లంతై ప్రాణాలు కోల్పోయింది.
Doctor death: హంపిలో హైదరాబాద్ డాక్టర్ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సరదా కోసం తుంగభద్ర నదిలో ఈతకు దిగిన డాక్టర్ అనన్యరావు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
తుంగభద్ర(Tungabhadra) నుంచి హెచ్చెల్సీ ఆయకట్టులో సాగులో ఉన్న పంటలకు, ప్రజల తాగునీరు అవసరం నిమిత్తం 70 క్యూసెక్కుల నీరును బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు.
కొప్పళ జిల్లా ప్రజల జీవనాడి తుంగభద్ర నది(Tungabhadra River) రోజు రోజుకూ కలుషితమవుతోంది. సాగు, తాగు నీరందించే నది పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నదిలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలతో నిండిపోతోంది.