Home » Tungabhadra
కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది. శుక్రవారం కర్ణాటక(Karnataka)లోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి.
తుంగభద్ర పైభాగం పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాంలో గురువారం సాయంత్రం 3 గంటలకు 78.01 టీఎంసీలు నీరు చేరింది.
తుంగభద్ర జలాశయం నుంచి అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు. డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.100 టీఎంసీలకు చేరాయి.
తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో(Inflow) తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా ఎగువ నుంచి వరద తాకిడి తగ్గింది. దీంతో ఇప్పుడే క్రస్ట్‌గేట్లు ఎత్తే ఆలోచన లేనట్లు బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తుంగభద్ర డ్యాం నుంచి ఎగువ, దిగువ కాలువలకు జూలై 10న నీరు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. డ్యాంలో ఉన్న నిల్వల ఆధారంగా నీటిని విడుదల చేయాలని తీర్మానం చేసింది.
తుంగభద్ర జలాశయానికి వరదనీటి చేరిక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజూ 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది రెండురోజుల నుంచి భారీగా పెరుగుతుండటంతో గత ఏడాది కొట్టుకుపోయిన 19వ క్రస్ట్‌గేట్ మరమ్మతు పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
దెబ్బతిన్న తుంగభద్ర ప్రాజెక్టు 32 క్రస్ట్‌గేట్లను మార్చాల్సి ఉన్న నేపథ్యంలో 2025-26 నీటి సంవత్సరంలో డ్యాంలో నీటి నిల్వను 80 టీఎంసీలకు పరిమితం చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు.
తుంగభద్ర ఆయకట్టు క్రస్ట్‌గేట్లకు కాలం చెల్లడంతో జలాశయానికి సంబంధించి 32 గేట్లను మార్చాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో.. ఈ ఏడాది జలాశయంలో పూర్తి స్థాయిలో కాకుండా 80 టీఎంసీల నీరు నిలపాలని అధికారులు నిర్ణయించారు.
తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది.