Home » TTD
ఈ నెల 27న టీటీడీ ఈవో.. కోర్టు ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. లేనిపక్షంలో 20 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు.
ఢిల్లీలో స్వామి వారి భక్తులకు ఎప్పటికప్పుడు స్వామివారి కార్యక్రమాలు తెలియజేస్తానని.. తిరుమలలో స్వామివారికి జరిగే కైంకర్యాలు ఢిల్లీ టీటీడీ ఆలయంలో జరిగేలా చూస్తానని సుమంత్ రెడ్డి వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తమిళులు అత్యంత పెరటాశి మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. తమ స్వగ్రామాల నుంచే తిరుమలకు కాలినడకన చేరుకుని స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది.
మానవత్వమే సిగ్గుపడే దృశ్యం ఇది. తిరుపతి రుయా ఆసుపత్రికి ఎదురుగా ఇస్కాన్ రోడ్డులోని బస్టా్‌పలో బతికున్న శవాల్లా పడివున్నారు వీరంతా. ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలీదు. ఎప్పుడొచ్చి ఈ నీడకు చేరారో ఏమో.. మూలుగుతూ ముక్కుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం ఉండవల్లిలోని...
తిరుమల వెళ్లే భక్తులకు మందుబాబులు నరకం చూపిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం టీటీడీ ఖండించింది. అలిపిరి నుంచి రుయా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో కొందరు ఆకతాయిలు పగిలిన గాజు సీసా ముక్కలను రోడ్డుపై విసిరేశారని తెలిపింది.
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
తిరుమల శ్రీవారు మంగళవారం ఉదయం సూర్యప్రభమీద ఊరేగిన స్వామి, రాత్రి చంద్రప్రభపై విహరించాడు.
వైఎస్ షర్మిల జీవితంలో ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా? అని మాధవ్ ప్రశ్నించారు. మత ప్రచారాలు స్వయంగా భర్తతో కలిసి చేశారని ఆరోపించారు. మత మార్పిడి చేయాలని పెద్ద ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.