Home » TTD
వేసవి సెలవులు చివరికి చేరుకోవడంతో తిరుమలకొండకు భక్తులు పోటెత్తారు. గురువారం నుంచే ఎటు చూసినా జనం కనిపిస్తున్నారు.
Leopard IN Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం సృష్టిచింది. చిరుత కదలికలతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ అధికారులు భక్తుల రక్షణ కోసం చర్యలు చేపట్టారు.
తిరుమల అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా కొనసాగిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగం ఏర్పాటు చేసి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
బుగ్గమఠం భూముల ఖాళీ సమస్యపై వైసీపీ నేత పెద్దిరెడ్డికి హైకోర్టు దేవదాయ అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ఆదేశించింది. అన్ని అభ్యంతరాలను ట్రైబ్యునల్ ముందే సమర్పించాలని సూచించింది.
Tirumala: తిరుమలలో అన్యమతస్థుడు బహిరంగంగానే నమాజ్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. నిత్యం స్వామివారి చెంత కళ్యాణం చేసుకుని వచ్చే భక్తులతో కళ్యాణ వేదిక ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది.
తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగానైనా ప్రభుత్వం టీటీడీకి రెగ్యులర్ సీవీఎస్వోను నియమించింది. విశాఖపట్నంలో ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణను టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బదిలీ చేసింది.
‘టీటీడీ గోశాలలో ప్రతినెలా 14వరకు గోవులు చనిపోతున్నాయని ఇప్పటికే గుర్తించాం. వంద గోవులు ఆసాధారణంగా చనిపోయాయంటూ చేసిన ప్రచారంలో వాస్తవాలు లేవు. త్వరలో మంచి ఫలితాలను అందరూ చూస్తారు’ అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.
తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి 50 కిలోల బరువు ఉన్న రెండు వెండి అఖండ దీపాలను విరాళంగా అందజేశారు. 300 ఏళ్ల క్రితం మైసూరు మహారాజు సమర్పించిన దీపాలు పాడైపోవడంతో, వాటి స్థానంలో ఈ కొత్త దీపాలను అందించారు.
తిరుమల నారాయణగిరి షెడ్లలో రెండు కుటుంబాల మధ్య గొడవ కారణంగా మహిళలు జుట్టు పట్టుకుని గొడవపడ్డారు. ఈ ఘర్షణ సమయంలో జరిగిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి వ్యవహారం ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీ చుట్టూ తిరుగుతోంది. నెయ్యిలో పామాయిల్‌తో పాటు 12 రకాల రసాయనాలు కలిపి కల్తీ తయారైనట్లు తేలింది.