Home » Toll Plaza
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూన్ 1న టోల్ రేట్ల(toll rates) పెంపుదల ఉండగా, ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ ఫీజు ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5 శాతం పెంచుతుంటారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు ఈ సారి తాత్కాలికంగా నిలిచిపోయింది.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రోడ్డు నిర్మాణానికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో రహదారి స్వరూపం దాదాపు ఖరారైంది. 6 ప్యాకేజీలతో 161 కి.మీ. మేర నిర్మాణం కానున్న ఉత్తరభాగం రహదారిలో టోల్ ప్లాజాలు
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు ఓట్లు వేసిన తర్వాత సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.
Andhrapradesh: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికుల వాహనాలతో జాతీయ రహదారి కిక్కిరిసి పోయింది. మే 13న పోలింగ్ నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రాకు ప్రయాణికులు తరలివెళ్తున్నారు. దీంతో సంక్రాంతిని మరిపించే విధంగా వాహనాల రద్దీ కొనసాగుతోంది.
జాతీయ రహదారులపై టోల్ ఫీజు పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.