• Home » TMC

TMC

West Bengal: మమతా బెనర్జీకి రోడ్డు ప్రమాదం.. కోల్‌కతా ఆసుపత్రికి తరలింపు

West Bengal: మమతా బెనర్జీకి రోడ్డు ప్రమాదం.. కోల్‌కతా ఆసుపత్రికి తరలింపు

టీఎంసీ(TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న కారులోనే స్వల్పంగా గాయపడ్డారని అధికారిక వర్గాలు చెప్పాయి.

Jairam Ramesh: మమత లేకుండా కూటమిని ఊహించలేం.. కాంగ్రెస్ బుజ్జగింపు

Jairam Ramesh: మమత లేకుండా కూటమిని ఊహించలేం.. కాంగ్రెస్ బుజ్జగింపు

పశ్చిమబెంగాల్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా కూటమికి టీఎంసీ కీలక స్తంభమని, మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు.

Mamata Banerjee: ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం.. మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం..

Mamata Banerjee: ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం.. మమతా బెనర్జీ షాకింగ్ నిర్ణయం..

పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సారి జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని వెల్లడించారు.

Shot dead: బైక్‌పై వచ్చి ఆ నేతను కాల్చి చంపిన దుండగులు..అసలేమైంది?

Shot dead: బైక్‌పై వచ్చి ఆ నేతను కాల్చి చంపిన దుండగులు..అసలేమైంది?

పశ్చిమ‌బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు ఆదివారం రోజున అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరి హత్యకు గురయ్యారు.

West bengal: సీట్ల షేరింగ్‌పై మమత పార్టీ మడత పేచీ..!

West bengal: సీట్ల షేరింగ్‌పై మమత పార్టీ మడత పేచీ..!

పశ్చిమబెంగాల్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ మరోసారి పార్టీ వైఖరిని స్పష్టం చేసింది. 'ఓపెన్ హార్ట్'తో కాంగ్రెస్‌తో మాట్లాడేందుకు సిద్ధమేనని, చర్చలు విఫలమైతే మాత్రం ఒంటిరిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని తెలిపింది.

Ration Scam: ప్రకంపనలు రేపుతున్న రేషన్ కుంభకోణం.. టీఎంసీ మరో కీలక నేత అరెస్ట్

Ration Scam: ప్రకంపనలు రేపుతున్న రేషన్ కుంభకోణం.. టీఎంసీ మరో కీలక నేత అరెస్ట్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం రేషన్ కుంభకోణం(Ration Scam) ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఎంసీ(TMC) నేతల్లో వణుకు పుట్టిస్తోంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో నార్త్ 24 పరగణాస్ జిల్లా బంగావ్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు శంకర్ ఆదిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది.

Ration Scam: రేషన్ పంపిణీ స్కాంలో టీఎంసీ నేత అరెస్ట్

Ration Scam: రేషన్ పంపిణీ స్కాంలో టీఎంసీ నేత అరెస్ట్

రేషన్ పంపిణీ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు శంకర్ అధ్యాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. విస్తృత సోదాల అనంతరం బంగాన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అయిన శంకర్ అధ్యాను ఈడీ అదుపులోకి తీసుకుంది.

 ED Team: ఈ రోజు గాయపడ్డారు..రేపు చనిపోవచ్చు.. టీఎంసీపై కస్సుమన్న కాంగ్రెస్

ED Team: ఈ రోజు గాయపడ్డారు..రేపు చనిపోవచ్చు.. టీఎంసీపై కస్సుమన్న కాంగ్రెస్

ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్‌‌లో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపులో లేవనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలని అడిగింది.

Ration Scam: ఈడీ అధికారులపై స్థానికుల దాడి.. ఎందుకంటే?

Ration Scam: ఈడీ అధికారులపై స్థానికుల దాడి.. ఎందుకంటే?

తమ నేతను తీసుకెళ్తున్నారన్న కోపంతో ఓ గ్రామస్థులు ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన ఘటన పశ్చిమబెంగాల్ లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ 24 పరగణాల జిల్లాకి చెందిన టీఎంసీ(TMC) నాయకుడు షాజహాన్ షేక్(రేషన్ కుంభకోణం)(Ration Scam) విచారణనిమిత్తం ఈడీ అధికారులు గ్రామానికి వచ్చారు. అనంతరం ఆయన్ని ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని కోరుతూ.. తమ కారులో తీసుకెళ్లారు.

Supreme court: మహువా మెయిత్రా పిటిషన్‌పై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం నోటీసు

Supreme court: మహువా మెయిత్రా పిటిషన్‌పై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం నోటీసు

తృణమూల్ కాంగ్రెస్ నేత మహువ మొయిత్రాపై లోక్‌సభ బహిష్కరణ వేటు పడిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌పై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. ముూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి