Home » tihar jail
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్ర శేఖర్ తాజాగా మరో లేఖను రాశారు. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ మెడికల్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జైల్లో ఉండి కేజ్రీవాల్ చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తారని.. ప్రజలు ఎవరూ మోసపోరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరించరని లేఖలో సుఖేష్ పేర్కొన్నారు. జూన్ 4న ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి సరైన సమాధానం చెబుతారన్నారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం (రేపు) విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు కవితను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) తీహార్ జైల్లోనే(Tihar Jail) చంపేందుకు బీజేపీ(BJP) కుట్రపన్నుతోందని ఆయన సతీమణి ఆప్ నేత సునీతా కేజ్రీవాల్(Sunitha Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు.
జైల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరణానికి చేరువ చేసే చర్యలు జరుగుతున్నాయని ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. తమ నాయకుడు కేజ్రీవాల్ టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే ఆయనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు జైలు అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహర్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు. జైలులో తనను ఎక్కువగా టార్గెట్ చేశారని, 24 గంటల పాటు నిఘా ఉంచారని, రోజువారి కార్యకలపాలు, సమావేశాలపై కూడా దృష్టిసారించారని మండిపడ్డారు.
తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ ను కరడుగట్టిన క్రిమినల్స్ కంటే దారుణంగా చూస్తున్నారని, ఒక గ్లాస్ వాల్ గుండా ఫోనులో ఆయన తనతో మాట్లాడారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలిపారు.
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ను జైలులో కలిసేందుకు ఆయన భార్య సునీత వచ్చారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. శుక్రవారం మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. ఢిల్లీ మద్యం కేసులో కవితను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.