Home » TGSRTC
నగరంలో.. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఏసీ బస్సులను నగిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోయే అవకాశముండడంతో రద్దీ రూట్లలో ఏసీ బస్సులను త్వరలో నడపనున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2.5% డీఏ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(మార్చి 8) పురస్కరించుకొని శనివారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అధికారులు ప్రారంభించారు. యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.
TGS RTC MahaLakshmi: రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలో ఆర్టీసీ సిబ్బంది.. పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసే ముందు విధి విధానాలు ఖరారు చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ(Telangana Tourism Department) ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రాలకు తీసుకెళ్లి వచ్చేందుకు ప్యాకేజీలను ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేబీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని టీజీఎస్‍ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు.
మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
మహాశివరాత్రి(Mahashivratri) నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 25, 26 తేదీల్లో కీసరగుట్టకు ఆర్టీసీ 200కు పైగా ప్రత్యేక బస్సులు నడుపనుంది.
TGSRTC Ticket Rates: ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్. టికెట్ ధరలపై భారీగా డిస్కౌంట్ ప్రకటించారు. మరి.. ఆ డిస్కౌంట్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Maha Kumbh Mela: Maha Kumbh Mela: మీ సొంత ఊరు నుంచే మహాకుంభ మేళకు వేళ్లేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తోంది. అలా వెళ్లాలనుకొంటే.. దాదాపు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉండాల్సి ఉంది.