Home » terrorist
ఉగ్రవాదులను ఎదుర్కొవడమంటే ధైర్యంతో కూడుకున్న పని అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పహల్గాం దాడిలో చాలా దారుణంగా పర్యాటకులను చంపేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన పహల్గామ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు స్థబ్ధగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.
PM Modi Mann Ki Baat: మన్ కీ బాత్ 121వ ఎసిపోడ్‌లో ప్రధానంగా ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిని గురించే ప్రసగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్ర దాడి ఘటన చిత్రాలను చూసిన ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని అంటూ..
Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Pahalgam Attack Pakistan Link Evidence: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో కచ్చితంగా పాకిస్థాన్ ప్రమేయముందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రపంచ దేశాల ముందుంచింది.
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. అమాయకులైన పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది.
UNSC Condemns Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణ మారణకాండకు ప్రేరేపించిన వారిని, చేసినవారిని చట్టం ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చింది.
YS Sharmila: మోదీ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నలవర్షం కురిపించారు. బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడుల ఘటనను వాడుకుంటుందని.. ఇది చాలా బాధాకరమని వైఎస్ షర్మిల అన్నారు.
Minister Nadendla Manohar: ఉగ్రవాదుల దుశ్చర్యలకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
CM Revanth Reddy: ఉగ్రదాడికి నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నాడు హైదరాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు నేతలు నివాళి అర్పించనున్నారు.