Home » terror attack
India-Pakistan Tensions: సరిహద్దుల వద్ద దాయాది దేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచన జారీ చేసింది. మే 7 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు పౌర రక్షణ మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించింది. యుద్ధం ఏ క్షణంలోనైనా ముంచుకు రావచ్చనేందుకు ఈ ప్రకటనే నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Undavalli Arun Kumar: ఏపీ పునర్వభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కాకుండానే ఏపీ విభజన చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
Jails In Jammu and kashmir: ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని జైళ్ల సెక్యూరిటీ బాధ్యత సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తోంది. అంతకు క్రితం ఆ బాధ్యతలు సీఆర్పీఎఫ్ నిర్వహించేది. 2023లో జైళ్ల నిర్వహణ బాధ్యత సీఆర్ఫీఎఫ్ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు బదిలీ అయింది.
India Blocks Pak Politicians Social Media Accounts: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో అసహనంతో ఇండియాపై విషం కక్కుతున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాయాది దేశంలోని రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, నటులు ఇలా అందరికీ వరసపెట్టి షాకులిస్తోంది.
భారత్ - పాక్ దేశాల మధ్య నియంత్రణ రేఖ ముళ్ల తీగల కంచెలకు ఆవల ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఇది పాకిస్తాన్ దళాల ఆక్రమణలో ఉన్న భారత భూభాగంలోని ప్రాంతం.
పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వస్తున్నాయి.
JD Vance: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరు దేశాలకు కీలక సూచన చేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్‌లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
దేశంలో మరో ఉగ్రదాడి గుట్టు రట్టైంది. BSF(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)‐ పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఈ ముప్పు తప్పింది. గత వారం రోజుల్లో భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో..