Home » Telugu Desam Party
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హరిబాబు మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓట్లు రిగ్గింగ్ చేశారంటూ అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన అంబటిపై చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు.
తాను రాజకీయాల్లోకి రావడం ఆ దేవుని దయ అని.. హీరోగా ఎదగటానికి కూడా దైవ సంకల్పమే కారణమని ప్రముఖ సినీ హీరో సుమన్ ఉద్ఘాటించారు. రాజకీయల్లోకి రావటానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని.. దైవ సంకల్పం ఉంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని సుమన్ పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డపై టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనం పట్టారు. 30 సంవత్సరాల తర్వాత పులివెందుల గడ్డపై టీడీపీ విజయ ఢంకా మోగించింది. అలాగే ఒంటిమిట్టలోనూ భారీ విజయం సొంతం చేసుకుంది.
పులివెందులలో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను జగన్ భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కార్యకర్తలు జగన్‌ను పులివెందులలో బండబూతులు తిడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో ఉహించిన దానికన్నా మెజార్టీ ఎ్కువ వచ్చిందని ఉద్ఘాటించారు. రీ పోలింగ్ అడిగింది వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డినేనని.. రీ పోలింగ్‌లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి పట్టం కట్టారని నొక్కిచెప్పారు.
జగన్ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్‌కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజలు ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచిందని మారెడ్డి లతారెడ్డి ఉద్ఘాటించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఒడిస్తామని మారెడ్డి లతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. మంగళవారం రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు బుధవారం కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌ను మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విద్య మౌలిక వసతుల కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.