Home » Telangana Congress
కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు సంబంధించి పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) కీలక విషయాలు వెల్లడించారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ పాల్గొంటారని నిర్ధారించారు. కాగా ఈ సభలో మహిళా డిక్లరేషన్‌ను (Women decleration) ప్రకటిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో, గులాబీ బాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విషయంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చెప్పిందే నిజమవుతోందా..? నిజంగానే గజ్వేల్‌కు (Gajwel) కేసీఆర్ గుడ్ బై చెప్పేస్తున్నారా..? ఇటీవల ప్రభుత్వం చేయించిన సర్వేలో (Survey) షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయా..? ఆ సర్వే చూసిన తర్వాత కేసీఆర్ తన ముందు రెండు ఆప్షన్లు పెట్టుకున్నారా..? అంటే తాజా పరిణామాలు, సోషల్ మీడియా (Social Media) లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది..
తెలంగాణలో ‘పవర్’ పాలిటిక్స్ (TS Power Politics) నడుస్తోంది. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ (BRS) .. అస్సలు ఇవ్వట్లేదని కాంగ్రెస్ (Congress) ఆధారాలతో సహా నిరూపించింది. అయినప్పటికీ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పవర్ వార్‌కు (Power War) ఫుల్‌స్టాప్ పడలేదు..
బీఆర్ఎస్‌ను ఢీ అంటే ఢీ అనే ఏకైక పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే. ఓ వైపు చేరికలు, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎండగడుతుండటంతో బీఆర్ఎస్‌కు అస్సలు రుచించట్లేదు. దీంతో రేవంత్ రెడ్డిని ప్రతిసారీ టార్గెట్ చేస్తూ వస్తోంది బీఆర్ఎస్. మంత్రులు కేటీఆర్, హరీష్, జగదీశ్వర్ రెడ్డి.. ఇలా ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి అక్కసు వెల్లగక్కుతున్నారు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ను (CM KCR) ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించి.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఇందుకు ఎలాంటి చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మార్చుకుని ముందుకెళ్తోంది...
అవును.. తెలంగాణ రాజకీయాలు (TS Politics) హీటెక్కాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్‌లో ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకెలా ఉంటాయో ఊహకందని పరిస్థితి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ (BRS, Congress) పార్టీల మధ్య ‘పవర్’ పాలిటిక్స్ (Power Politics) నడుస్తున్నాయి...
తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తుండటంతో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత డీలా పడటం, రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, పార్టీలో పదవులు ఇవ్వట్లేదని అసంతృప్తులు ఎక్కువ కావడం, నేతలు పార్టీకి గుడ్ బై చెబుతుండటం ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో.. బూస్ట్ ఇచ్చేందుకు అగ్రనాయకత్వం రంగం సిద్ధం చేసింది...
అవును.. తెలంగాణలో కాంగ్రెస్ (TS Congress) అధికారంలోకి వస్తే సీతక్కే (Seethakka) సీఎం.. ఆ సందర్భం వస్తే చేయవచ్చు కూడా.. మల్లిఖార్జున ఖర్గేను (Mallikarjuna Kharge) అధ్యక్షుడ్ని చేసింది కాంగ్రెస్సే.. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్‌లోనే విస్తృత అవకాశాలున్నాయ్.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు...
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ గురించి తానా సభలో మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది’ అని రేవంత్ చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ రాజకీయం మొదలైంది.