Home » Telangana Assembly
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఏడు రోజుల పాటు సభ జరుగగా.. 37.44 గంటల పాటు నడిచింది. ఈ సమావేశాల్లో మొత్తం 8 బిల్లులు పాస్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచే..
శాసనసభ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. తెలంగాణ తల్లి ఆవిర్బావ ఉత్సవంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో మొదలైన సమావేశాలు.. శనివారం రైతు భరోసాపై స్పల్పకాలిక చర్చ తర్వాత నిరవధికంగా వాయిదా పడ్డాయి.
Telangana: ‘‘కొడంగల్‌లో కంపెనీలు పెట్టొద్దా, ఉద్యోగాలు ఇవ్వవద్దా, మెడికల్ చదువులు వద్దా. అభివృద్ధికి అడ్డుపడితే తొక్కుకుంటూ పోతా అని అందుకే అంటున్నా. అన్నీ వద్దు అన్నాక అభివృద్ధి పథంలో నడిపించడం ఎట్లా సాధ్యం అవుతుంది. దొంగలకు సద్దులు మోస్తున్నారు.’’ అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. క్రూర మృగాలనైనా బంధించే శక్తి తమ సభ్యులకు ఉందన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు విధ్వంసకారులుగా తయారయ్యారంటూ విరుచుకుపడ్డారు. మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా?.. మూసీపై నల్గొండ జిల్లా ప్రజలను అడుగుదాం అని సభలో ముఖ్యమంత్రి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అనుచరులం, బంధువులమని వేల కోట్లు కొల్లగొట్టారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. 80వేల పుస్తకాలు చదివినవారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారు అనుకున్నామని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని చెప్పడం విడ్దూరంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల అనర్హులకు ఆయాచిత లబ్ధి జరిగిందని అన్నారు. అవుట్‌లకు, రాజీవ్ రహదారి, శ్రీశైలం హైవే, క్రషర్లు, మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదాం హరీష్‌రావు, కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా.. వాళ్ల నాన్న కట్టిండా అని నిలదీశారు.