Home » Tamil Nadu
తమిళనాడులోని అధికార తమిళగ వెట్రి కళగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది. ప్రజలకు అసౌకర్యం కల్పించడం కానీ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించడం కానీ చేయవద్దని సూచించింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఆరంభంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధికార బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే మద్యం దుకాణాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది.
తమిళనాడులో ఎన్నికల అనంతరం ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి టి.టి.వి. దినకరన్ తన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత, హీరో విజయ్‌కి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. 'జన నాయగన్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా విజయ్ చేసిన డ్యాన్స్ వీడియో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో గతంలో విమర్శలు ఎదుర్కొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మంగళవారంనాడు కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విడదీసే సనాతన ధర్మాన్ని రూపుమాపాలని అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు.
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ (JCD Prabhakar) మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీవీకేకు చెందిన మరో ఎమ్మెల్యే రవిశంకర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
తమిళనాడు సీఎంఓ ఆఫీస్ సోషల్ మీడియా ఖాతాల డీపీలు మారాయి. ముఖ్యమంత్రి విజయ్ ఫొటోలను డీపీలుగా పెట్టారు. విజయ్ ఫొటో డీపీగా పెట్టిన గంటల్లోనే మ్యాజిక్ జరిగింది. సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్ క్యూ కట్టారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా ఆ పార్టీలోని షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగంకు మద్దతు ప్రకటించింది.
సాధారణ స్థాయి నుంచి వచ్చానంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమం నుంచి నిరాడంబరతను చాటుకుంటున్న విజయ్ వరుస ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. చెన్నైలోని ఎండీఎంకే చీఫ్ వైకోను మంగళవారంనాడు ఆయన నివాసానికి వెళ్లి విజయ్ కలుసుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల కంటే సేవకే అగ్ర ప్రాధాన్యం ఇస్తారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడానికి పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.