Home » Sunday
కనుచూపుమేర నరమానవుడు లేడు.. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. మంచు కప్పేసింది. ఒళ్లు గగుర్పొడిచే భయానక పర్వత లోయలైన హిమాలయాలు.. పర్వతారోహకులు కష్టపడి ఇంకాస్త ముందుకెళితే.. అక్కడొక ఒంటరి దాబా కనిపిస్తుంది.
‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టుగా... కుర్రకారుకు ఇంట్లో చేసిన రుచులు నచ్చట్లేదు. బిర్యానీలు, నూడుల్స్, పిజ్జాలు ఓల్డ్ ట్రెండ్... ఇప్పుడంతా ‘కె’ ఫుడ్. ‘కొరియన్ చికెన్’, ‘కొరియన్ ఛీజ్ బన్’... గతేడాది ఫుడ్ యాప్స్లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాల్లో ఉన్నాయంటే ‘కె’ (కొరియన్) వంటకాల క్రేజ్ మనదేశంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి తెలిసి ఉండటంతో ఇక ఆలస్యం చేయకుండా దేవతలకు ఒక చక్కని ఆలోచన చెప్పాడు.
ఓవైపు దుర్గాదేవీ పూజలు... మరోవైపు దాండియా ఆటలు... ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా దసరా శోభతో కళకళలాడుతుంది. విజయదశమి (అక్టోబర్ 2) సందర్భంగా కొందరు తారలు ఈ పండగతో తమకున్న అనుభవాలను పంచుకున్నారిలా...
ఈ వారం ఆ రాశి వారికి పండగే పండగ.. అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. శుభవార్త వింటారని, కొన్ని సంఘటనలు అనుకున్నట్టే జరుగుతాయని తెలుపుతున్నారు. కష్టం ఫలిస్తుందని, ఆరోగ్యం బాగుంటుందని, ఆప్తులతో ఉల్లాసంగా గడపుతారని, ఖర్చులు అధికంగా ఉంటాయని తెలుపుతున్నారు.
సంపన్నులతో వేలూ లక్షలూ ఖర్చుపెట్టించే తిరుమల వెంకన్న, పేదలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా తన దర్శనం చేసుకునే అవకాశం కల్పించాడు. తిరుపతికి చేరుకున్న భక్తులు చేతిలో పైసా లేకపోయినా సలక్షణంగా తిరుమలకు చేరుకుని స్వామి దర్శనం చేసుకోవచ్చు.
తిరుమల అనగానే శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం అని అందరికీ తెలుసు. అయితే తిరుమల ఆలయంలో కలియుగ అవతారమైన శ్రీనివాసుడితో పాటూ త్రేతాయుగంలో ఆరాధ్యుడైన శ్రీరాముడు, ద్వాపర యుగంలో భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల పూజలను స్వీకరిస్తూ అంతే వైభవంగా వేడుకలు అందుకుంటున్నారని చాలామందికి తెలియదు.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ముహూర్తం ఉండాలి. తాళి, తలంబ్రాలు ఉండాలి. మంగళమేళాలు హంగూ ఆర్భాటాలు తప్పనిసరి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం వీటిలో దేనికీ ప్రాధాన్యం లేదు. ఇవేవీ లేకుండానే పెళ్లి జరిగిపోతుంది.
తిరుమల వెంకన్నకి రోజూ షడ్రసోపేతమైన ఆహారపదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషకవిలువలు మెండుగా ఉన్నవే. ఆయుర్వేదపరంగా అత్యంత ఆరోగ్యకరమైనవే. దాదాపు 50 రకాలైన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు.
ప్రపంచ సంపన్నుల జాబితాను ఏటా లెక్కలు కట్టి వెల్లడించే ‘ఫోర్బ్స్’ సంస్థ గనుక దేవుళ్లలోకెల్లా ధనవంతులెవరు? అని ఆరా తీసి అంచనా వేస్తే... నెంబర్ వన్ స్థానం బహుశా మన తిరుమల వెంకన్నకే దక్కుతుంది. వేంకటేశుని ధర్మకర్తల మండలి టీటీడీ వార్షిక బడ్జెట్టే రూ.5వేల కోట్లకు పైనే.