Home » Summer
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ వేసవి కాలంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.
వేసవి వచ్చింది. దొంగలకు కూడా సీజన్ ప్రారంభమైంది. సెలవుల్లో అనేక మంది ఇళ్లు వదిలి బంధువుల ఊర్లకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారు.
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మూడు రోజులుగా మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు.
ఎండలు మండిపోతున్నాయి. దీంతో మద్యం ప్రియులు బీరు వైపు మొగ్గు చూపుతున్నారు. బ్రాందీ, విస్కీలను సేవించే మందుబాబులు ప్రస్తుత వేసవి కాలంలో వాటికి స్వస్తి చెప్పి వేసవి తాపాన్ని తీర్చుకోవటానికి బీరు సేవిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఈ నెల 4వ తేది అగ్ని నక్షత్రం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇప్పుడే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు.
వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి.
వేసవి తాపాన్ని తగ్గించే వివిధ రకాల పానీయాల్లో ప్రముఖమైనది నన్నారి. స్వచ్ఛమైన వేర్లతో తయారు చేసే ఈ నన్నారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఒక వైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్‌లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. వడదెబ్బతో ముగ్గురు, పిడుగుపాటుకు ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.