Home » Somireddy Chandramohan Reddy
Andhrapradesh: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుల ప్రాధాన్యాల గురించి విజయసాయి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కుల ప్రాధాన్యాల గురించి విజయసాయి రెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అంటూ ఎద్దేవా చేశారు. 2022-24 మధ్యకాలంలో ఒక కులంపై కక్షకట్టి కేబినెట్‌లో ప్రాతినిధ్యమే లేకుండా చేశారని గుర్తుచేశారు.
డ్రగ్స్ నియంత్రణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని అదనపు డీజీపీలతో కమిటీ వేయాలని నిర్ణయిస్తే వైసీపీ నేతలకు
ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి మరణంపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామోజీరావుతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని..1991లో నెల్లూరులో పుట్టిన సారావ్యతిరేక ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉద్యమం విజయవంతం కావడాన్ని బాధ్యతగా భావించారని వెల్లడించారు.
నెల్లూరు: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉండే కారు, పాస్ పోర్టు చిక్కాయని, తనది కాదని చెబుతున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్‌కు రింగ్ మాస్టార్ కాకాణి అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు, కిరాయి రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో పలు గ్రామాలు ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులపై వరుస దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.
Andhrapradesh: సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమిరెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కూటమి అభ్యర్థి నామినేషన్‌కు వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో వెంకటాచలం జాతీయ రహదారి జన సందోహంగా మారింది. నామినేషన్ వేసిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సర్వేపల్లి అభ్యర్థిగా రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆయన అల్లుడు ఆగడాలు పెరిగిపోయాయని వివరించారు.
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ మద్యపాననిషేధం తెచ్చి ఓటు అడుగుతానని అన్నాడని ఆయన చెప్పిన మాటలు వట్టివేనని అన్నారు.
Andhrapradesh: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్వీన్ స్వీప్ చేయాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది. ఆ విధంగా ప్రణాళికలు కూడా తెలుగుదేశం పార్టీ రూపొందింస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో మాజీ మంత్రి సోమిరెడ్డి భేటీ అయ్యారు. సోమవారం ఉదయం ఆనం నివాసానికి చేరుకున్న సోమిరెడ్డికి ఎమ్మెల్యే సాదర స్వాగతం పలికారు. అంతేకాకుండా ఆనం, సోమిరెడ్డి ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరువురు నేతలు సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.