Home » Somireddy Chandramohan Reddy
‘చేసిన పాపాలకు కేసుల భయంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నావా? లేక నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడుకోవడానికా?
TDP Leaders: వైసీపీ నేత, విజయసాయిరెడ్డి రాజీనామాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని అన్నారు.
Somireddy Chandra Mohan Reddy: డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ అన్ని విధాలా అర్హులే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొని, అవమానాలు పడిన తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
MLA Gorantla Butchaiah Chowdary: అన్ని వ్యవస్థలను వైసీపీ అధినేత జగన్ నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ తీరు వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పింఛన్లు అందజేశామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
Pemmasani Chandra Sekhar :అమరావతిని జగన్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని ద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రోడ్లనిర్మాణ పనులు మూలన పడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
తాడేపల్లి ప్యాలెస్‌లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదలకు తాము సిద్ధం, జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌లో వ్యవసాయానికి, రైతాంగానికి పెద్దపీట వేశామని అన్నారు.
61 శాతం అంబులెన్స్‌లో సెలైన్ల కొరత ఉండటంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కొరతా ఉన్నట్లు కాగ్ నిర్ధారించిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. అరబిందో 430 అంబులెన్స్‌లు నడిపి 720 అన్నట్లు ప్రభుత్వానికి లెక్కలు చూపిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వెల్లడించారు.
రబీ సీజన్‌లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
Andhrapradesh: అరబిందో కంపెనీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో 108 బాధ్యతలను చేజిక్కించుకున్న అరబిందో కంపెనీ వందల కోట్లు దోచుకుని ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిందని విమర్శించారు. 108 అంబులెన్సుల నిర్వహణలో అరబిందో కంపెనీ వైఫల్యాన్ని కాగ్ బట్టబయలు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
విజయసాయి, అతని వియ్యంకుడు సగం రాష్ట్రాన్ని దోచేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏం మిగిలేది కాదని సోమిరెడ్డి విమర్శించారు.