Share News

Somireddy Chandramohan Reddy : పాపాలన్నీ చేసి...రాజకీయాల నుంచి తప్పుకొంటావా?

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:17 AM

‘చేసిన పాపాలకు కేసుల భయంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నావా? లేక నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడుకోవడానికా?

Somireddy Chandramohan Reddy :  పాపాలన్నీ చేసి...రాజకీయాల నుంచి తప్పుకొంటావా?

విజయసాయిరెడ్డి ప్రకటనపై సోమిరెడ్డి వ్యాఖ్యలు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ‘చేసిన పాపాలకు కేసుల భయంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నావా? లేక నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడుకోవడానికా? ఈ రాజీనామాల పరంపర ఒక్క సాయిరెడ్డితో ఆగేట్టు లేదు. రాత్రికో.. రేపు రాత్రి లోపలో మరో ఒకరిద్దరు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటనపై ఆయన శుక్రవారం స్పందించారు. ‘చేయకూడని పాపాలన్నీ చేసేని, ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉంది. వ్యవసాయం చేస్తానంటున్నావ్‌.. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా? ఇప్పుడు సేద్యంలోకి దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? 2004 నుంచి మొన్నటి వరకూ జగన్‌రెడ్డితో కలిసి దోచుకొన్న రూ.లక్షల కోట్ల ప్రజల సొత్తు... ఎక్కడుందో చెప్పు’ అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 25 , 2025 | 03:17 AM