Home » Seethakka
Telangana Govt: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా శిశుసంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
Seethakka: కేంద్రమంత్రి బండిసంజయ్పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై బండి వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ విజన్ ఉన్న నాయకుడని తెలిపారు.
చరిత్ర పునాదుల మీదే జాతి నిర్మితమవుతుందని, ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి మూలాలు, వేష, భాషలను మరవకూడదని మంత్రి సీతక్క అన్నారు.
ఫిబ్రవరి 15న మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బుధవారం మంత్రి సీతక్క, గిరిజన సంఘాల నాయకులు ఆహ్వానం అందించారు.
ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో జనవరి 23న జరిగిన ప్రజాపాలన గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన కుమ్మరి నాగేశ్వర్రావు(42) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.
ప్రజల సంక్షేమం కోసం మేము చేస్తున్న పనులు ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఈ క్రమంలో వారు చేయని పనులు మేము చేసినందుకే ప్రతి దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుందని చెప్పారు. గాంధీభవన్లో బుధవారం జరిగిన ‘మంత్రితో ముఖాముఖీ’ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.
రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతోపాటు అదనంగా పాలు, మిల్లెట్స్ అల్పాహారం (స్నాక్స్)ను కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
తెలంగాణలో కులాలవారీ జనాభా లెక్క తేలింది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించేందుకు చేపట్టిన కులసర్వే నివేదిక ప్రభుత్వానికి అందింది.
వేసవి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని, అందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.