Home » Secunderabad
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలైన ఘటన సికింద్రాబాద్‌లోనిబోయినపల్లి పరిధిలో జరిగింది. స్థానిక బాపూజీనగర్ బస్తీలో నివాసముంటున్న కిరణ్‌గౌడ్(32) కొన్నాళ్లుగా తన స్నేహితులతో కలిసి బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడ్డాడు.
సికింద్రాబాద్: ఉద్యోగం పేరుతో రకరకాల మార్గాల్లో యువతను మాయచేస్తున్నారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ లోనూ తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్మీ నకిలీ ఐడీ కార్డుతో మిలటరీ కాలేజీ ప్రాంగణంలోకి చొరబడిన ఆగంతకులు ఏం చేశారంటే..
సికింద్రాబాద్, మోండా మార్కెట్: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసుల పేరుతో కొందరు కేటుగాళ్లు నగల వ్యాపారిని మోసగించి కోటి రూపాయలు కాజేశారు.
భారత్ గౌరవ్ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.
న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్.. గత యాభై ఆరు సంవత్సరాల క్రితం నెలకొల్పిన ఈ కర్మాగారం భారతదేశానికే తలమానికంగా నిలుస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలోని అణు ఇంధన శాఖలకు ఊపిరిగా నిలుస్తున్న ఈ సంస్థ ఏర్పాటై యాభై ఆరు వసంతాలు నిండాయి. ఈ సందర్బంగా ఓ ప్రత్యేక కథనం..
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం 12వ పడిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేరస్థుల ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ ఒకటి. అయితే ఈ స్టేషన్‌లోకి అడుగుపెట్టే నేరస్థులను వెంటనే పట్టుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..
సింగరేణి కార్మిక ప్రాంతమైన మంచిర్యాల ప్రజలకు శుభవార్త. మంచిర్యాల రైల్వేస్టేషన్ లో ఇకనుంచి భగత్ కి కోఠి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు మంచిర్యాల స్టేషన్‌లో ఆగుతుంది. ఈ నెల 31వ తేది నుంచి ఈ ప్రత్యేక రైలుకు హాల్టింగ్ కల్పించారు.
జూన్ 1నుంచి జూలై 31 వరకు 44 వీక్లీ స్పెషల్ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. విశాఖపట్నం-చర్లపల్లి, తిరుపతి-విశాఖపట్నంతోపాటు ఇతర ప్రాంతాలకు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.