Home » Schools
ఆ పాఠశాలలో ఒకేఒక్క విద్యార్థిని ఉన్నారు. తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో కేవలం ఒకేఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నడుపుతున్నారు. గ్రామం ఉండి, విద్యార్థులున్నా ఎవరూ ప్రభుత్వ పాఠశాలకు రావడం లేదు.
Telugu Lessons: కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉపాధ్యాయులు వేసవి శిబిరాలు నిర్వహించారు. ఈ క్యాంపులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరయ్యారు. వారికి టీచర్స్ యూట్యూబ్‌లో చూసి తెలుగు వర్ణమాల నేర్పించారు.
ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ డిజిటల్ స్టడీ మెటీరియల్, అసైన్‌మెంట్లను సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ-నీట్ ఫోరం తెలిపింది.
ఊటీలో పుష్ప ప్రదర్శనకు నగరం ముస్తాబైంది. గురువారం నుంచి పుష్ప ప్రదర్శన జరగనుంది. ఈ సందర్బంగా నీలగిరి జిల్లాలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కాగా... ఊటీలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ నిర్వహణలోని బొటానికల్ గార్డెన్‌లో వివిధ రకాలకు చెందిన 5 లక్షల పూలమొక్కలను పెంచారు.
సరిహద్దు జిల్లాలైన కుప్వారా, బారాముల్లా, బండిపోరలోని గురెజ్ సబ్-డివిజన్ మినహా కశ్మీర్ అంతటా ఈనెల 13 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రకటించారు.
బస్సుకోసం పరుగెత్తుతున్నా.. ఆపకుండా పోయిన డ్రైవర్.. అంటూ రెండు నెలల క్రితం ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా నిలిచిన ప్లస్ టూ చదువుతున్న సుహాసిని అనే విద్యార్ధినికి 437 మార్కులొచ్చాయి. బస్సు వెంబడి పరుగెత్తుతున్నా ఆపని విషయంపై డ్రైవర్, కండక్టర్లపై సస్పెన్షన్ వేటుపడిన సంగతి తెలిసిందే.
బాలికల గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిగా మహిళలు మాత్రమే పనిచేయాలనే ప్రభుత్వ నిబంధనను కచ్చితంగా అమలుచేయాలని ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయించింది.
Summer Vacation Safety Tips: వేసవి సెలవులు వచ్చేయడంతో పిల్లలు ఊర్లకు పయనమయ్యారు. ఇక అక్కడ వారి ఆటలకు అంతే ఉండదు. వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు.
వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మున్నూర్ సోమారంలోని 20 ఏళ్ల నాటి పాఠశాల భవనంలోని ఓ తరగతి గదిలో బుధ వారం పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.