Home » Sankranthi festival
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడకు 6 ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
TGSRTC: సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని... హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో జల్లికట్టు పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో జనవరి 14వ తేది పొంగల్ వేడుకల్లో భాగంగా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. మదురై అవనియాపురం, పాలమేడు, అలంగానల్లూర్(Madurai Avaniyyapuram, Palamedu, Alanganallur) తదితర ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు పోటీలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు.
Telangana: సంక్రాంతి పండగ పలువురి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఎంతో ఉత్సాహంతో గాలిపటాలు ఎగురవేసిన పలువురు యువకులు, చిన్నారులు అనుకోకుండా మృత్యువుబారిన పడ్డారు. కొందరు గాలిపటాలు విద్యుత్ తీగలకు ఇరుక్కుని విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాలిపటాలు ఎగురవేస్తూ భవనాల పైనుంచి పడి మృతి చెందారు.
Andhrapradesh: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. అటువంటి గోదావరి జిల్లాల ఘనమైన మర్యాదను విజయవాడకు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తి తన అత్తవారింటికి వచ్చి దక్కించుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతుండగా.. ఏపీలో రాజకీయ నాయకులు పండగను అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఎందుకనుకుంటున్నారా....
Andhrapradesh: సంక్రాంతిని పురస్కరించుకుని నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబం రాకతో సందడి వాతావరణం నెలకొంది. నారావారిపల్లె గ్రామదేవత దొడ్డి గంగమ్మకు చేసిన నారా నందమూరి కుటుంబం ప్రత్యేక పూజలు చేసింది. కులదైవం నాగదేవతలకు చంద్రబాబు కుటుంబం సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి నైవేద్యాల సమర్పించింది.
Telangana: భాగ్యనగరం బోసిపోయింది. నగర రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.