• Home » RJD

RJD

Lok Sabha Polls: బీహార్‌లో కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇస్తామంటోన్న లాలు.. కండీషన్స్ అప్లై

Lok Sabha Polls: బీహార్‌లో కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇస్తామంటోన్న లాలు.. కండీషన్స్ అప్లై

బీహార్‌లో కూటమి సీట్ల లెక్క తేలడం లేదు. భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం కొలిక్కి రాకముందే రాష్ట్రీయ జనతా దళ్ తన అభ్యర్థులను ప్రకటించింది. కొందరికి టికెట్లను కూడా అందజేసింది. దీంతో అక్కడ కూటమి పోటీ చేసే స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతలో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆఫర్ ఇచ్చారు.

Lok Sabha Polls: ఇండియా బ్లాక్‌లో చీలిక..? 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ

Lok Sabha Polls: ఇండియా బ్లాక్‌లో చీలిక..? 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ

బీహార్ ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్టే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క తేలలేదు. సంకీర్ణ ధర్మాన్ని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ విస్మరించింది. కలిసి సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఏకపక్షంగా 13 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్ ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న 4 నాలుగు స్థానాలు ఇందులో ఉన్నాయి.

Loksabha Elections: బీహార్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బూస్ట్.. పప్పు యాదవ్ పార్టీ విలీనం

Loksabha Elections: బీహార్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బూస్ట్.. పప్పు యాదవ్ పార్టీ విలీనం

లోక్ సభ ఎన్నికల వేళ బీహార్ కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది. ప్రాంతీయ పార్టీ జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ హామీ మేరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశామని జన్ అధికార్ పార్టీ అధినేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేయడం వల్ల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు.

Loksabha Elections: రాజకీయాల్లోకి లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే..?

Loksabha Elections: రాజకీయాల్లోకి లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే..?

లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు రోహిణి ఆచార్య లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. లాలు కుటుంబానికి కంచుకోట అయిన సరన్ లోక్ సభ నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ప్రస్తుతం లాలు కుటుంబం నుంచి ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, పెద్ద కూతురు మిసా భారతి రాజకీయాల్లో ఉన్నారు.

Smriti Irani: దాణా దొంగ లాలు ప్రసాద్ యాదవ్.. మోదీపై వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ

Smriti Irani: దాణా దొంగ లాలు ప్రసాద్ యాదవ్.. మోదీపై వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ

ప్రధాని మోదీకి కుటుంబం లేదని, పిల్లలు లేరని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వరసగా లాలు ప్రసాద్ యాదవ్‌కు కౌంటర్ ఇస్తున్నారు. లాలు ప్రసాద్ యాదవ్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దాణా దొంగ అయిన లాలు ప్రసాద్ యాదవ్‌కు మోదీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.

PM Modi: లాలుకు బీజేపీ కౌంటర్.. మేం మోదీ కుటుంబం అంటున్న నేతలు

PM Modi: లాలుకు బీజేపీ కౌంటర్.. మేం మోదీ కుటుంబం అంటున్న నేతలు

ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి కుటుంబం లేదు, పిల్లలు లేరని విరుచుకుపడ్డారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది.

Patna: వివాదంలో తేజస్వీ యాదవ్.. హత్య కేసు నిందితుడితో ఫొటోలు

Patna: వివాదంలో తేజస్వీ యాదవ్.. హత్య కేసు నిందితుడితో ఫొటోలు

బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) వివాదంలో చిక్కుకున్నారు. ఓ హత్యకేసు నిందితుడు తేజస్వీని కలవడం.. వారిరువురు కలిసి ఫొటోలు దిగడం.. అవి కాస్తా వైరల్ కావడంతో రాజకీయాలు వేడెక్కాయి.

Nitish Kumar: తలుపులు తెరిచే ఉన్నా నేను వెళ్లను.. లాలూకు నితీశ్ కౌంటర్..

Nitish Kumar: తలుపులు తెరిచే ఉన్నా నేను వెళ్లను.. లాలూకు నితీశ్ కౌంటర్..

బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని వీడి ఎన్డీఏలో చేరిన నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. గతాన్ని విస్మరించి సరికొత్తగా ముందుకు వెళ్దామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Rabri Devi: బీహార్ శాసనమండలి విపక్ష నేతగా రబ్రీదేవి

Rabri Devi: బీహార్ శాసనమండలి విపక్ష నేతగా రబ్రీదేవి

బీహార్ శాసన మండలికి ఆర్జేడీ విపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఎన్నికయ్యారు. రాష్ట్ర శాసనసభా పక్ష నేతగా రబ్రీదేవి కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఉన్నారు. పశుగ్రాసం కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ పేరు చోటుచేసుకోగానే ఆయన స్థానంలో 1997లో రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.

Bihar: మీకోసం తలుపులు తెరిచే ఉన్నాయి.. నితీశ్‌కు లాలూ ప్రసాద్ ఆఫర్

Bihar: మీకోసం తలుపులు తెరిచే ఉన్నాయి.. నితీశ్‌కు లాలూ ప్రసాద్ ఆఫర్

బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగి, ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి