Home » RJD
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ.. బీజేపీ సత్తా ఏమిటో వెల్లడైందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు సినిమా సూపర్ ప్లాఫ్ షో అయిందన్నారు. అయితే తొలి దశలో బిహార్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మహాఘట్‌బంధన్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్రంలో ప్రతిపక్షం ఇండియన్ నేషనల్ డెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలియన్స్ (ఇండియా కూటమి) అధికారంలోకి వస్తే... కోటి ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే రూ. 500కే సిలండర్ దేశవ్యాప్తంగా అందిస్తామన్నారు.
లోక్‌సభ 2024 ఎన్నికలు(Lok Sabha elections 2024) మరికొన్ని రోజుల్లో మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, RJD నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav)తో పాటు ఇతర పార్టీ నేతలు 'పరివర్తన్ పత్ర' పేరుతో 2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను(RJD Manifesto) విడుదల చేశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లంచ్ బ్రేక్‌లో చేపకూరతో భోజనం తీసుకోవడం, ఆయనే స్వయంగా ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడం సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించగా, మీ 'ఐక్యూ' ఇంతేనా అంటూ తేజస్వి కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రీయ్ జనతాదల్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయనకు కుటుంబ సభ్యులే ముఖ్యం అని మండిపడింది. లోక్ సభ ఎన్నికల తొలి జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. అందులో లాలు ఇద్దరు కూతుళ్లకు టికెట్ దక్కింది. దాంతో లాలు ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేసింది.
బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పట్టుదలగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ మరో పార్టీతో శుక్రవారంనాడు చేతులు కలిపింది. ముఖేష్ సహనీ సారథ్యంలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 3 సీట్లు కేటాయించింది. రెండు పార్టీల నేతలు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులతో కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని నేతలతొ ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొంమతంది నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతుంటే.. మరికొందరు నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి అధికారం లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా.. ఎన్టీయే (NDA) కూటమి వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ఇండియా పేరుతో కూటమి కట్టాయి. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ కూటమి స్థానంలో వివిధ పార్టీల కలయికతో ఇండియా కూటమి ఏర్పడింది.
'ఇండియా' కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు ఖరారైంది. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్‌కు 9 సీట్లను ఇవ్వాలని ఆర్జేడీ నిర్ణయించింది. పూర్ణియా నియోజవర్గంతో సహా 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది.
పూర్ణియా సీటును వదులుకునే ప్రసక్తే లేదని పప్పు యాదవ్ అంటున్నారు. అవసరమైతే ఈ ప్రపంచాన్ని వీడేందుకు సిద్ధం. కానీ పూర్ణియాలోని ప్రజలకు ఎప్పటికీ దూరం అవనని తేల్చి చెప్పారు. పూర్ణియా లోక్ సభ స్థానాన్ని తాను వీడటం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టేనని ప్రకటించారు. ఇక్కడ బీజేపీని నిలువరించేందుకు గత 40 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నానని తెలిపారు.