Home » Resign
అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని కీలక నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ సైతం వీడేందుకు సిద్దమైనట్లు ఓ చర్చ అయితే జిల్లాలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. స్వయంగా డొక్కా నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.
జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయు అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. పెన్షన్ల పంపిణీలో జరిగిన నిర్లక్ష్యంతో 32 మంది వృద్దులు చనిపోయారు. ఆ కుటుంబాలకు ఏం భరోసా ఇస్తావు జగన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయు అని సోషల్ మీడియా ఎక్స్‌లో నెటిజన్లు పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల రాజీనామా అంటూ హడావుడి కనిపిస్తోంది. దీనిని వైసీపీ (YCP) నేతలు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం కోసమని రూ.5వేల గౌరవ వేతనంతో వాలంటీర్లను నియమించారు. 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీ నియమించారు. ఈ వ్యవస్థతో కొన్ని లాభాలుంటే.. అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.
AP Elections 2024: ఎన్నికలు సమీపించేసరికి గ్రామ, వార్డు వలంటీర్లు రాజకీయ ముసుగు తొలగించి, అసలు స్వరూపం బయటపెడుతున్నారు. పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడంతో..
లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్‌లోని ముజఫర్‌పూర్ బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి చెందిన అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన నిషాద్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అంతా అధికార వైసీపీ స్కెచ్ ప్రకారమే నడుస్తోంది. అధికార పార్టీ ఒత్తిడి మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామాలు చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు శుక్రవారంనాడు రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వీరు సిద్ధమవుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రీకారం చుట్టిన తరుణంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఏడాది క్రితం 'ఆప్'లో చేరిన నటి సంభావనా సేథ్ ప్రకటించారు. పార్టీలో చేరి పొరపాటు చేశానంటూ ఆమె వ్యాఖ్యానించారు.
చివరి నిమిషంలో బాస్ చేసిన పనికి తిక్కరేగడంతో ఓ ఉద్యోగి అప్పటికప్పుడు జాబ్‌కు రాజీనామా చేసేశాడు. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. గత నెలలో 31 వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డి నేతృత్వంలో అవిశ్వాసానికి ప్రయత్నించి కౌన్సిలర్లు విఫలమయ్యారు.