Home » Republic day
ప్రగతి లక్ష్యాల దిశగా భారతదేశం నిజమైన ప్రయాణం సాగిస్తోందని, అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదుగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
'నీట్' అంశంతో సహా రాష్ట్రంలోని పలు అంశాలపై గవర్నర్, డీఎంకే మధ్య చాలాకాలంగా సయోధ్య లేదు. తమిళనాడులోని విశ్వవిద్యాలయలకు వీసీల నియామకం విషయంలో గవర్నర్‌కు, డీఎంకే ప్రభుత్వాన్ని మధ్య జరుగుతున్న గొడవపై ఇటీవలే రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
76వ గణతంత్రి దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అనేక రాష్ట్రాలకు చెందిన శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం.
Wine Shops: జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా వైన్ షాపులు ఉండవు. ఈరోజు రాత్రి నుంచే మద్యం దుకాణాలు క్లోస్ అవుతాయి. అలాగే బార్లు, పబ్స్ కూడా మూసివేస్తారు. దీంతో అలర్ట్ అయిన మద్యం ప్రియులు ముందుగానే వైన్ షాపుల ముందు వాలిపోయి తమకు కావాల్సినంత మద్యాన్ని కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నారు.
ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే భారతమాత మహాహారతిని ఈసారి వైభవంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 8వ విడత మహాహారతి సందర్భంగా కిషన్‌రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాట్లను పరిశీలించారు.
గణతంత్ర వేడుకల నిర్వహణకు వాల్తేరు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఇండియా కీలక విధానమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉంది. 2024 అక్టోబర్‌లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం.
భారతదేశ 76వ రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నగరం చెన్నైలో జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఐదంచెల భద్రత సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.
జనవరి 26న న్యూఢిల్లీ(New Delhi) కర్తవ్యపథ్‌లో నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు దేశవ్యాప్తంగా 10 వేల మంది ప్రత్యేక అతిథులుగా హాజరవుతుండగా, తెలంగాణ(Telangana) నుంచి 31 మంది హాజరవుతున్నారు. వారిలో వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారుల, కళలు, హస్తకళాకారులు ఉన్నారు.
2025 రిపబ్లిక్ డే పరేడ్ ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా ఉండనుంది. ప్రజలతో మరింత చేరువ అయ్యేందుకు ఈసారి 10 వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక ఆహ్వానితులలో వివిధ రంగాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.