Home » Republic day
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
భారతదేశం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే, ఈసారి కూడా, భారతదేశ సైనిక శక్తి, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథంలో ప్రదర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే శాసనమండలిలో ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించడానికి, సంపన్న భారతదేశాన్ని నిర్మించడానికి తమ ప్రయత్నాలను బలోపేతం చేయాలనే సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
ఢిల్లీ: భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శుభాకాంక్షలు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్(US), న్యూఢిల్లీ(Delhi) మధ్య 21వ శతాబ్దంలో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటోందని రూబియో చెప్పారు.
అమరావతి: 76వ గణతంత్ర దినోత్సవానికి భారతదేశం ముస్తాబైంది. దేశ రాజధాని ఢిల్లీ సహా అన్నీ రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఢిల్లీలో దేశ ప్రజలకు నాయకత్వం వహించనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు కావడంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో ఈసారి గణతంత్ర వేడుకలు ప్రత్యేకంగా జరగనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారతదేశ చరిత్రలో అతిపెద్ద దినోత్సవమైన గణతంత్ర దినోత్సవం ఈ ఏడాది 76వ సంవత్సరం జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంగా ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
గణతంత్ర దినోత్సవం వచ్చేసినా ఖైదీల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఆయా కుటుంబాల సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.