Home » Rajendranagar
Telangana: బీఆర్‌ఎస్‌కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే.. ఆయనతో చాలా సేపటి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana: ఆ వ్యాపారి కుటుంబీకులు అంతా ఎంతో ఉత్సాహంగా దైవదర్శనానికి వెళ్లారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని ఆనందంగా ఇంటికి తిరుగుపయనమయ్యారు. అయితే ఇంటికి వచ్చిన చూసిన ఆ కుటుంబీకులకు మాత్రం పెద్ద షాకే తగిలింది. అయ్యో ఎంత పని జరిగిదంటూ యజమానులు లబోదిబోమని మొత్తుకున్నారు. ఇంతకీ వాళ్లు తిరిగివచ్చేసే సరికి ఏం జరిగిందనే దానిపై వివరాలలోకి వెళ్తే...
Telangana: రాజేంద్రనగర్‌లో పట్టపగలే దొంగలు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి తెగబడ్డారనే వార్త తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్‌ను పోలీసులు బయటపెట్టారు. అసలు దొంగతనమే జరగలేదనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇదంతా ఆ ఇంట్లోని యువతి ఆడిన డ్రామాగా నిర్ధారించారు. ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో యువతి ఇంతటి డ్రామాకు తెరతీసినట్లు ఖాకీల విచారణలో బయటపడింది. యువతి చేసిన పనికి షాక్ అవడం కుటుంబ సభ్యుల వంతైంది.
Telangana: జిల్లాలో దొంగల ఆగడాలకు అంతేలేకుండా పోతంది. వేసవి కాలం నేపథ్యంలో ఉక్కపోతగా ఉండటంతో ప్రజలు ఆరు బయట నిద్రించేందుకు ఇష్టపడుతుంటారు. ఇదే అదునుగా భావించి దొంగలు తమ చేతులకు పనులు చెబుతుంటారు. అర్ధరాత్రులు దర్జాగా ఇంట్లోకి చొరబడి దొరికకాడికి దోచుకుంటుంటారు. అయితే రాజేంద్రనగర్‌లో మాత్రం దొంగలు చేసిన పని ప్రజలను భయాందోళనకు గురిచేసింది. పట్ట పగలు అని చూడకుండా.. ఎలాంటి అదురు బెదరు లేకుండా దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు.
రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి లోని ఎస్‌ఎన్సీ కన్వెన్షన్ హాల్ లో రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ విభాగం చైర్మన్ ఫయిమ్ ఖురేషి ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
రాజేంద్రనగర్‌లో కత్తి పోట్ల కలకలం రేపుతోంది. తెల్లవారుజామున నితీష్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా నితీష్‌పై దుండగులు కత్తితో దాడి చేశారు.
Telangana: రాజేంద్రనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. హైదర్‌గూడ, కేశవ్‌నగర్ కాలనీలో ఇంటి తాళాలు పగలగొట్టి మరీ దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో అందినకాడికి దోచుకుని పరారయ్యారు. రెండు తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఒరిజినల్ ఇంటి పత్రాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వరుసగా మూడు ఇండ్లకు బయటి నుంచి గడియపెట్టి మరీ దుండగుల ముఠా తమ పని కానిచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిశారు. ప్రకాశ్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు నరేందర్ రెడ్డి శాలువాకప్పి సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రకాశ్ గౌడ్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది.
హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములకు భారీగా డిమాండ్ ఏర్పడింది. శివారులో భూమి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. భూమి కబ్జా చేసేందుకు ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
Telangana: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు అరుదైన ఘనత లభించింది. దేశంలోనే నంబర్ వన్ ఠాణాగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ నిలిచింది. పలు అంశాలను ప్రమాణికంగా తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వక శాఖ ఎంహెచ్‌ఏ నిర్వహించిన అధ్యయనం సర్వేలో సింహబాగు కేటగిరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాజేంద్రనగర్ పోలీసులు ఈ అరుదైన ఘనతను సాధించారు.