Home » Raghurama krishnam raju
Supreme Court Order: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రభావతిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
AP Assembly: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి డిప్యూటీ స్పీకర్ రఘురామ చెప్పిన మాటలు కాసేపట్లో నవ్వులు పూయించేలా చేశాయి. పవన్ ఈరోజు చాలా ఫ్రెష్‌గా ఉన్నారని రఘురామ అన్నారు.
Raghurama serious: శాసనసభలో సభ్యులపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు సీరియస్ అయ్యారు. దయచేసి సభ్యులు అలా చేయవద్దని.. కఠిన చర్యలు తప్పవని స్ఫష్టం చేశారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల గురించి ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే ప్రసంగం మొత్తం ఇంగ్లీలోనే ఉంది. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు.
రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ప్రకాశం జిల్లా : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.
మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
AP High Court: కామేపల్లి తులసిబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌పై కస్టోడియల్ టార్చర్ కేసులో బెయిల్ కోసం తులసిబాబు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ రోజు విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం.
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్‌లో వాదనలు ముగిసాయి. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
Raghurama: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకివీడులో నిన్న జరిగిన ఘటనపై సునీల్ బాధ్యత వహించాలన్నారు. సునీల్ అనుచరుడిని వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ అన్నారు.