Home » Raghunandan Rao
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రను బీజేపీ పార్టీ పరిచయం చేస్తుందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు తమపై దండయాత్ర చేస్తే ఊరుకునేది లేదని రఘునందన్ రావు హెచ్చరించారు.
రఘునందన్ ఇంకోసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడితే తాను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ చరిత్ర గురించి రఘునందన్‌కి ఏం తెలుసని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని.. సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
MP Raghunandan Rao: తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడా లేదని, బీఆర్ఎస్ చెల్లని రూపాయని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న పెయిడ్ బ్యాచ్‌లపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టిస్తున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపించారని ఆయన అన్నారు.
కవిత షర్మిలలా పాదయాత్ర చేసి జూన్ 2న కొత్త పార్టీ స్థాపించవచ్చని రఘునందన్‌రావు చెప్పారు. ఆయన ఈ ప్రక్రియపై ప్రశ్నలు వేసి, బీసీల అవమానం, సామాజిక సమస్యలపై ఆమె మాటలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
MP Raghunandan Rao: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశద్రోహులను వెంటనే దేశం నుంచి పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన ఇప్పటికి అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు.
MP Raghunandan Rao: పాకిస్తాన్‌కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్‌లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రాన్ని అమృత సరోవర్‌గా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
MP Raghunandan Rao: టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉగ్రదాడిపై సోకాల్డ్ సెక్యులర్ మేధావులు ఎందుకు మాట్లాడటం లేదని ఘునందన్ రావు ప్రశ్నించారు.
MP RaghunandanRao: హెచ్‌సీయూ గురించి మాట్లాడవద్దని తమకు చెప్పే నైతిక హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఎక్కడిదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. హెచ్‌సీయూ భూముల విషయంలో బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపిస్తున్నారని.. ఆ పేరు ఎందుకు బయటకు చెప్పడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు.