Home » Purandeswari
దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించ వద్దంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల (Election Commission) కు ఆమె లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు కలిసి సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు సూచించినట్లు తెలిసిందని చెప్పారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ ఆచరణలోకి తీసుకొచ్చేది నవర్నతాలు కాదని.. నవ అరాచకాలని బీజేపీ నేత నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదు ఫేక్ ప్రభుత్వమన్నారు. నియంత హిట్లర్‌ను మించి జగన్ గ్లోబుల్ ప్రచారం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేరుతో ఫేక్ ప్రకటన వచ్చిందన్నారు.
ఉండవల్లిలో(Undavalli) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నిసవాంలో ఎన్డీయే నేతలు కీలక భేటీ ప్రారంభమైంది. బీజేపీ(BJP) రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థ నాథ్ సింగ్, పార్టీకి చెందిన ఇతర నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ భేటీ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ బ్యాచ్ మరో కుట్ర చేసింది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించినట్లు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
అనపర్తి టికెట్ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari)తో చర్చించినట్లు అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallimilli Rama Krishna Reddy) తెలిపారు. శనివారం నాడు దగ్గుబాటి పురందేశ్వరి - వెంకటేశ్వరరావు దంపతులతో సమావేశం అయినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని.. మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని సీఈవో ఎంకే మీనాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లేఖ రాశారు. రాజకీయ పార్టీలు విమర్శలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని ఎన్నికల పరివర్తనా నియమావళి చెబుతోందన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ఆదివారం విజయవాడలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - తెలుగుదేశం - జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ చీఫ్, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ఏప్రిల్ 4 వ తేదిన ఉమ్మడి పార్టీల పార్లమెంట్ సమన్వయ సమావేశం జరుగుతుందని తెలిపారు.
Daggubati Purandeswari: రాజీలేని రాజకీయ చాతుర్యం.. వాగ్దాటిలోని గాంభీర్యం.. వ్యవహారంలో చాణక్యం.. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం.. అన్నింటికీ మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ‘తూర్పు’ ఆడబడుచుగా సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ బరిలో బీజేపీ తరపున అడుగుపెట్టారు...